Mallu Bhatti Vikramarka: భట్టి రాజకీయ ప్రస్థానం ఇదే.. సాధారణమైన వ్యక్తి నుంచి డిప్యూటీ సీఎం వరకు..!

భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలంగాణ రాజకీయాల్లో పేరున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

  • Written By:
  • Updated On - December 7, 2023 / 12:52 PM IST

Mallu Bhatti Vikramarka: భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలంగాణ రాజకీయాల్లో పేరున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ముఖ్యమంత్రులైన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సన్నిహితుడిగా భట్టికి పేరుండేది. ఈ సాన్నిహిత్యం వల్లనే ఆయన కాంగ్రెస్‌ హయాంలో 2009-11 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్‌ విప్‌‌గా, 2011-14 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌ వంటి కీలక పదవులను కూడా చేపట్టారు. వైఎస్సార్‌ని రాజకీయ గురువుగా భావించే భట్టి విక్రమార్క.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.

మల్లు అకండ, మల్లు మాణిక్యం దంపతులకు 15 జూన్ 1961న మల్లు భట్టి విక్రమార్క జన్మించారు. ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం. హైదరాబాద్‌లోని నిజాం కళాశాల నుండి గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆయనకు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఎఆర్ మల్లు, మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి. మల్లు భట్టి విక్రమార్కకు నందినితో వివాహం జరగ్గా.. సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య అనే ఇద్దరు కుమారులున్నారు.

Also Read: Revanth Reddy Swearing Ceremony : LB స్టేడియం వద్ద కాంగ్రెస్ శ్రేణుల హంగామా మాములుగా లేదు

1990-92 వరకు ఆంధ్రా బ్యాంక్ డైరెక్టర్‌గా మల్లు భట్టి విక్రమార్క పనిచేశారు. 2000-2003 వరకు పీసీసీ సెక్రటరీగా మల్లు భట్టి విక్రమార్క కొనసాగారు. 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మల్లు భట్టి విక్రమార్క తొలుత 2007లో జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా భట్టి గెలుపొందారు. 2009 వరకు ఎమ్మెల్సీగా కొనసాగిన భట్టి అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2009లో చీఫ్ విప్ అయ్యారు. భట్టి 4 జూన్ 2011న ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.

2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి మూడోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా భట్టి నిలిచారు. 18 జనవరి 2019న INC అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2వ తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) నాయకుడిగా మల్లు భట్టి విక్రమార్కను నియమించారు.

We’re now on WhatsApp. Click to Join.

2018లో మధిర నుంచి గెలిచిన భట్టి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ప్రజాగొంతుకగా ప్రభుత్వంపై ప్రశ్నలు ఎక్కుపెడుతూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. సీఎల్పీ నేతగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తనదైన పాత్ర పోషించారు. పీపుల్స్ మార్చ్ పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికి అభయహస్తం ఇచ్చారు.

Follow us