Site icon HashtagU Telugu

High Tension : సికింద్రాబాద్లో ఇంటర్నెట్ బంద్

High Tension At Secunderaba

High Tension At Secunderaba

సికింద్రాబాద్ (Secunderabad ) రణరంగంగా మారింది. హిందూ సంఘాల కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం సికింద్రాబాద్ (Secunderabad ) కుమ్మరిగూడ (Kurmaguda ) ముత్యాలమ్మ ఆలయం(Muthyalamma Temple)లోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఫై యావత్ హిందూ సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ఘటన కు వ్యతిరేకంగా ఈరోజు సికింద్రాబాద్ బంద్‌ కు హిందూ సంఘాలు పిలునివ్వడం ఉద్రిక్తతకు దారితీసింది.

హిందూ సంఘాలు భారీ ర్యాలీ చేపట్టగా.. ఆలయ సమీపంలోని మసీదు వీధిలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మతఘర్షణలు జరిగే అవకాశం ఉందని ..ఈ వైపుకు రావొద్దని హెచ్చరించినప్పటికీ, హిందూ సంఘాల కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లేందుకు ట్రై చేయడం తో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పోలీసులపైకి కార్యకర్తలు చెప్పులు, కుర్చీలు, వాటర్ ప్యాకెట్లు విసరడంతో..పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. మరోవైపు మతఘర్షణలు చెలరేగకుండా సికింద్రాబాద్లో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

Read Also : Gold Rates Hikes: దీపావళికి ముందే బంగారం పరుగులు.. రూ. 80 వేలకు చేరువ