తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది..? ఇంటర్నల్ గా ఆ ఇద్దరి నేతల మధ్య సఖ్యత కరువైందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గవర్నర్ తమిళిసై విషయంలో టీఆరెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడంలేదని ఆరోపిస్తున్న తెలంగాణ బీజేపీ పెద్దలు.. సొంత పార్టీ వ్యవహారాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రోటోకాల్ కు.. పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధం ఏంటనే డౌట్ వస్తుంది కదూ. అవును..సొంత పార్టీలో సరైన గౌరవం దక్కడంలేదని.. ఎన్నో భరించలేని అవమానాలు ఎదుర్కొంటున్న నేతలకు ఇది కచ్చితంగా పెద్ద విషయమే. అందుకే గొంతు విప్పారు. దీంతో కాషాయదళంలో కలకలం రేగింది.
తెలంగాణ బీజేపీలో ముఖ్యనేతల మధ్య విభేదాలు బజారునపడ్డాయి. రోజు అవమానిస్తుంటే…చూస్తూ ఊరుకోలా..?ఎన్నాళ్లు భరించాలి..?అని మండిపడ్డారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. వ్యక్తిగతాలకు పోయేవాళ్లకు ఈసారి టికెట్లు రావని బండి సంజయ్ అన్నారు. బండి వ్యాఖ్యలు ఈటల రాజేందర్ ను ఉద్దేశించినవనే ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ…రఘునందన్ రావు ప్రశ్నించిన రోజు పార్టీ చీఫ్ హెచ్చరించడం ఇంటర్నల్ యుద్దాన్ని తలపిస్తోందన్న ప్రచారం జరుగుతుంది. బండిసంజయ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పార్టీలో ధిక్కార స్వరాలు అంతర్గతంగా నెలకొన్నాయి. కేంద్ర పెద్దలు జోక్యం చేసుకుని సరిద్ధిదినా…పార్టీ కార్యక్రమాల వేదికపై ప్రోటోకాలు పాటించడంలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అసంతృప్తి వ్యక్తంచేయడం మరోసారి చర్చకు దారితీసింది. టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ వైఖరిని తప్పుబడుతూ…సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రిజీకి రఘునందన్ రావు తన అసంతృప్తిని వెలగక్కారని తెలుస్తోంది. అనుమానిస్తుంటే…భరించాలా…పార్టీ ప్రోటోకాల్ పాటించకపోతే కుదరని తేల్చిచెప్పినట్లు మీడియా కోడై కూస్తోంది.
గత కొంత కాలంగా రఘునందన్ రావుపై …బండి వ్యవహారించిన తీరు బాహాటంగానే తెలిపారని పార్టీ వర్గాలు అంటున్ానయి. తొలి దశప్రజా సంగ్రామ యాత్ర చార్మినార్ లో ప్రారంభించినప్పుడు…ముగింపు సభ సిద్ధిపేటలో జరిగినప్పుడు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అవమానించినట్లు కదా అని రఘునందన్ ప్రశించినట్లు సమాచారం. GHMCతోపాటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ నియామకాల విషయంలోనూ బండి వ్యవహారించిన తీరు తనను అవమానించేలా ఉన్నాయని రఘునందన్ విమర్శించినట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీలో పెద్దనేతల మధ్య విభేదాలు రచ్చకు వచ్చి.. చర్చకు దారితీశాయి.