Bandi Sanjay in Trouble : ‘బండి’కి అస‌మ్మ‌తి చెక్

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ హ‌వాను త‌గ్గించ‌డానికి ఆ పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్లు అంత‌ర్గ‌తంగా చ‌క్రం తిప్పుతున్నారు.

  • Written By:
  • Updated On - March 28, 2022 / 11:43 PM IST

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ హ‌వాను త‌గ్గించ‌డానికి ఆ పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్లు అంత‌ర్గ‌తంగా చ‌క్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌చ్చిన కొంద‌రు నేత‌ల‌తో క‌లిసి ఒక బీజేపీ తెలంగాణ సీనియ‌ర్ లీడ‌ర్ గ్రూప్ రాజ‌కీయాల‌ను న‌డుపుతున్నాడ‌ని వినికిడి. ఆయ‌న అండ‌తోనే క‌రీంన‌గ‌ర్ కు చెందిన లీడ‌ర్లు కొంద‌రు బండిపైర తిరగ‌బ‌డ్డారు. రెండుసార్లు ర‌హ‌స్య స‌మావేశాల‌ను నిర్వ‌హించారు. ఢిల్లీ వ‌ర‌కు వెళ్లి ఫిర్యాదు చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. ఢిల్లీ పెద్ద‌లు తాత్కాలికంగా స‌ర్దిచెప్పిన పంపిన‌ప్ప‌టికీ శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించ‌లేద‌ని భావిస్తున్నారు. ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం బీజేపీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతోంద‌ని అధిష్టానం విశ్వ‌సిస్తోంది.

తెలంగాణ బీజేపీలోని అంత‌ర్గ‌త వివాదాల‌ను ఢిల్లీ పెద్ద‌లు సీరియ‌స్ గా తీసుకున్నారు. కాంగ్రెస్ త‌ర‌హా సంస్కృతికి చెక్ పెట్టాల‌ని బీజేపీ అధిష్టానం స‌న్న‌ద్ధం అయింది. ఆ మేర‌కు పార్టీ సంస్థాగ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎస్ సంతోష్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ రాబోతున్నాడు. బీజేపీ నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం, అభిప్రాయభేదాల గురించి అధిష్టానంకు ఒక నివేదిక రూపంలో ఇవ్వ‌డానికి ఆయ‌న సిద్ధం అయ్యాడు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు మంగళవారం ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మ‌రోసారి సమావేశం అయ్యారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, సీనియర్‌ నేత సుగుణాకర్‌రావుతో పాటు హైదరాబాద్‌కు చెందిన సీనియర్‌ నేతలు వెంకట రమణి, రాములు మరికొందరు పాల్గొన్నట్లు సమాచారం.ఇప్పటికే వీరు రెండు సార్లు రహస్యంగా సమావేశాలు నిర్వహించగా.. అసంతృప్తి నేతలందరినీ తెరచాటుగా ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం జ‌రిగిన స‌మావేశం మూడోది కావడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
అస‌మ్మ‌తి లీడ‌ర్లు కొందరు ఇటీవ‌ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని క‌లిశారు. బండి ఒంటెద్దు పోక‌డ గురించి గోడును వెళ్లబోసుకున్నార‌ని తెలిసింది. ఈ రహస్య భేటీల ఈ విషయంలో కేంద్ర అధిష్టానం జోక్యం చేసుకున్నా పంచాయితీ మాత్రం తెగ‌లేదు.

ఈ వ్యవహారాన్ని బీజేపీ రాష్ట్ర అధిష్టానం సైతం సీరియస్‌గా తీసుకుంది. పార్టీకి న‌ష్టం చేకూరుస్తున్న నేత‌ల‌పై చర్యలు తీసుకోవాల‌నే విషయమై సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డితో ఓ కమిటీని ఏర్పాటు చేయాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ గతంలోనే చ‌ర్చలు జ‌రిపార‌ని వినికిడి. కరీంనగర్‌కు చెందిన ఇద్దరు నేతలపై వేటు వేయాలని అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోమారు అసంతృప్త నేత‌లు హైద‌రాబాద్‌లోని హైద‌ర్‌గూడ‌లో ర‌హ‌స్యంగా స‌మావేశమయ్యార‌నే విష‌యం పార్టీ నేతలను అయోమయానికి గురిచేస్తోంది. వాళ్ల వెనుక ఎవ‌రున్నార‌నే దానిపై అధిష్టానం ఆరా తీస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వ‌చ్చిన ఒక సీనియ‌ర్ లీడ‌ర్ తో పాటు బీజేపీలోని తెలంగాణ‌కు ఒక కీల‌క లీడ‌ర్ ఉన్నాడ‌ని భావిస్తోంది. ఆ విష‌యాన్ని క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించ‌డానికి మంగ‌ళ‌వారం ఢిల్లీ దూత వ‌స్తున్నాడు. ఏం జ‌రుగుతుందో..చూడాలి.