Inter Exams : విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన ఇంటర్ బోర్డు

  • Written By:
  • Publish Date - March 1, 2024 / 08:48 PM IST

ఇంటర్ విద్యార్థులకు (Inter Students) ఇంటర్ బోర్డు (Inter Board) గుడ్ న్యూస్ తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని ప్రకటించింది. నిమిషం నిబంధనపై విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ లో ఇంటర్ పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల నిమిషం ఆలస్యం తో విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో లోనికి అనుమతించడం లేదు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో పరీక్షా రాయలేకపోయామనే బాధతో ఆత్మ హత్య లు చేసుకోవడం , మనోవేదనకు గురి కావడం తో విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమిషం అయినా ఆలస్యం కాకుండా ఎలా ఉంటుంది..టైం కు బస్సులు లేకపోవడం , ట్రాఫిక్ సమస్య ఇలా పలు అవాంతరాలు వస్తుంటాయి..అంతే తప్ప కావాలని ఎవ్వరు ఆలస్యం రారు కదా..అధికారులు , టీచర్లు కరెక్ట్ టైం కు కాలేజీలకు వస్తున్నారా..? అధికారులంతా కరెక్ట్ గా పనిచేస్తున్నారా అంటూ ప్రశ్నించడం చేస్తున్నారు. దీంతో ఇంటర్ బోర్డు నిమిషం నిబంధనపై వెనక్కు తగ్గింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని ప్రకటించింది.

తెలంగాణ లో రెండు రోజుల క్రితమే ఇంటర్ పరీక్షలు మొదలవ్వగా..ఏపీలో ఈరోజు నుండి పరీక్షలు మొదలయ్యాయి. ఈరోజు నుంచి 20 వరకు ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకూ సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది.

Read Also : CM Revanth Reddy : తర్వలోనే విద్య, వ్యవసాయ కమిషన్లు