సీఎం రేవంత్ రెడ్డి భద్రతా (CM Revanth Reddy Security) విషయంలో ఇంటెలిజెన్స్ (Intelligence) కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ సిబ్బందిని పూర్తిగా మార్చి వేస్తున్నామని బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు ఉన్న భద్రతా సిబ్బంది గతంలో కేసీఆర్ (EX CM KCR) వద్ద పనిచేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుంది. దాంతో పాత వారిని తీసివేసి.. కొత్త భద్రతా సిబ్బందిని నియమించింది. గతంలో కేసీఆర్ వద్ద పనిచేసిన ఏ ఒకర్ని కూడా రేవంత్ వద్ద పనిచేయకూడదని సీఎంఓ డిసైడ్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ సీఎం గా బాధ్యతలు చేపట్టగానే రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా పదేళ్ల పాటు బిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన ప్రతి ఒక్కర్ని బదిలీ చేస్తుండడం..స్దాన మార్పులు , శాఖల మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే అనేక శాఖల్లో మార్పులు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు తన సొంత సిబ్బంది ని సైతం మార్చేశారు. దీనిని బట్టి అర్ధం చేసుకొని రేవంత్ ఎంతగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారో…ఓ పక్క పాలన ..మరోపక్క రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం..మరోపక్క ప్రతిపక్ష పార్టీల విమర్శలకు చెక్ పెట్టడం..ఇలా అన్ని తానై చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి ముందు ముందు ఇంకెన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
Read Also : CM Revanth: గెలుపే లక్ష్యంగా రేవంత్ ‘లోక్ సభ’ ఎన్నికల ప్రచారం, రూట్ మ్యాప్ రెడీ