Site icon HashtagU Telugu

R. S. Praveen Kumar : బిఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్‌ వరుస అవమానాలు ఎదురుకుంటున్నారా..?

Rs Praveen

Rs Praveen

ఐపీఎస్ అధికారి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (R. S. Praveen Kumar), బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మంచి ప్రజాదరణ సంపాదించారు. రాష్ట్రం మొత్తం తిరిగి, స్వేరో ఉద్యమం ద్వారా దళిత యువతలో మంచి ప్రభావాన్ని చూపించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్, బండి సంజయ్‌లతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు వస్తున్న పేరుగా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఉండేవారు. అయితే, బీఎస్పీని వదిలి బీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి ఆయన రాజకీయ భవిష్యత్తు అనిశ్చితిలో పడింది.

Kantara: రిషబ్ బర్త్‌డే గిఫ్ట్.. అదిరిన కొత్త లుక్, రిలీజ్ డేట్ ఫిక్స్.!

నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేసిన ప్రవీణ్ కుమార్, అనూహ్యంగా మూడో స్థానంలో పరాజయం పొందారు. ఈ పరాజయం తరువాత కూడా ఆయనకు పార్టీ నుండి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం లభించలేదు. చట్టసభల్లోకి పంపుతామని హామీ ఇచ్చినప్పటికీ, ఎమ్మెల్సీ ఛాన్స్‌ను బీజేపీ నుంచి వచ్చిన దాసోజు శ్రవణ్‌కు ఇచ్చారు. దీంతో ఆర్ఎస్ అనుచరులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. తన స్వంత గుర్తింపును త్యాగం చేసి బీఆర్ఎస్‌లోకి వచ్చిన వ్యక్తికి ఈ తరహా అవమానాలు ఎదురవడం అభిమానులను ఆవేదనకు గురి చేస్తున్నాయి. కేవలం టికెట్ విషయంలోనే కాదు పార్టీ సమావేశాల్లో కూడా ప్రవీణ్‌కు తగిన గౌరవం లభించకపోవడం వల్ల వారిలో ఆగ్రహం పెరుగుతుంది. తాజాగా యశోదా ఆస్పత్రిలో జరిగిన సమావేశంలో ఆయనను వేరుగా కుర్చీలో కూర్చోబెట్టిన తీరు పెద్ద దుమారమే రేపింది. ఇది యాదృచ్ఛికం అన్నా, ఆయనకు బీఆర్ఎస్‌లో విలువ లేకపోవడమే కారణమన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రవీణ్ భవిష్యత్తు బీఆర్ఎస్‌లో ఎంత స్థిరంగా ఉంటుందో అన్న సందేహాలు ఆయన అనుచరుల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.