HYD : హైదరాబాద్‌లో మరోసారి సోషల్ మీడియాలో పరిచయం క్రూరకృత్యానికి దారితీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికను ఆకర్షించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన యువకుడిని బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బాలానగర్ సీఐ టి. నర్సింహరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు.
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన హరికృష్ణ (21) డిగ్రీ పూర్తిచేసి ఇటీవల కాలంలో ఖాళీగా ఉంటున్నాడు. సుమారు ఐదు నెలల క్రితం, కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. క్రమంగా ఆ పరిచయం సన్నిహితంగా మారింది.
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియానికి బిగ్ షాక్.. ఆర్సీబీ జట్టే కారణమా?!
ఈ క్రమంలో, జూన్ నెలలో హరికృష్ణ ఆ బాలికను ఐడీపీఎల్ టౌన్‌షిప్‌కి రావాలని పిలిచాడు. అక్కడికి చేరుకున్న ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో బాలికపై లైంగిక దాడి కొనసాగించాడు.
ఇటీవలి రోజుల్లో బాలికకు వాంతులు, ఆరోగ్య సమస్యలు రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో ఆమె గర్భవతిగా ఉన్నట్లు తేలింది. ఈ విషయంపై నిలదీయగా, హరికృష్ణ తనపై అత్యాచారం జరిపిన విషయాన్ని బాలిక వెల్లడించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు పాక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. సీఐ నర్సింహరాజు ఈ సందర్భంగా సోషల్ మీడియా పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రత్యేకించి మైనర్ బాలికలు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Telangana : తెలంగాణలో అతి భారీ వర్షాలు …నీటిపారుదల శాఖ అధికారులకు అప్రమత్తత ఆదేశం!