Hyderabad : ప్యారడైజ్ హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 07:39 PM IST

హైదరాబాద్ నగరంలో గత నాల్గు రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ లలో తనిఖీలు చేస్తూ..సదరు హోటల్ యాజమాన్యాలు ఫుడ్ విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నారా..లేదా అని తనిఖీలు చేస్తూ..ఎక్కడిక్కడే నోటీసులు జారీ చేయడం..సీజ్ చేయడం చేస్తూ వస్తున్నారు. వీరి తనిఖీల్లో ప్రముఖ హోటల్స్ సైతం ఫుడ్ జాగ్రత్తలు పాటించడం లేదని తేలింది.

ఈరోజు టాస్క్ ఫోర్స్ బృందం మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న ప్యారడైజ్ హోటల్‌లో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్యారడైస్ ఫుడ్ కోర్టు.. నిబంధనల ప్రకారమే ఫుడ్ తయారు చేస్తోందని.. జాగ్రత్తలు పాటిస్తోందని, FSSAI లైసెన్స్ నిజమైన కాపీని బిల్లింగ్ కౌంటర్‌లో ప్రదర్శించినట్టుగా అధికారులు గుర్తించారు. ఫుడ్ హ్యాండ్లర్లు హెయిర్ క్యాప్స్, గ్లౌజులు ధరించి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లలో ఉన్న నిబందనలను పూర్తిగా పాటిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. FSSAI నిబంధనల ప్రకారం ముడి పదార్థాలు, సెమీ ప్రిపేర్డ్ ఐటెమ్స్‌తో పాటు రెడీ చేసిన ఆహార పదార్థాలు కవర్ చేయబడి సరిగ్గా లేబుల్ చేసినట్టు చెప్పుకొచ్చారు.