కాంగ్రెస్ పార్టీ (Congress Party)లోకి వలసల పర్వం ఆగడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాగైతే బిఆర్ఎస్ (BRS) నుండి పెద్ద ఎత్తున నేతలు వచ్చి చేరారో..ఇప్పుడు లోక్ సభ ఎన్నికల తరుణంలో కూడా అలాగే నడుస్తుంది. బిఆర్ఎస్ పదేళ్ల పాలన లో కీలక పదవులు అనుభవించి..కేసీఆర్ (KCR) కు దగ్గర గా ఉన్న నేతలంతా ఇప్పుడు రేవంత్ దగ్గరికి వస్తున్నారు. అలాగే పలువురు నేతలు బిజెపి లోకి కూడా వెళ్లడం జరిగింది. రీసెంట్ గా మాజీ BRS ఎంపీలు సీతారాం నాయక్, నగేశ్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి నిన్న BJPలో చేరగా… ఇప్పుడు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy), మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి (ముధోల్), కోనేరు కోనప్ప (సిర్పూర్), పైళ్ల శేఖర్ రెడ్డి (భువనగిరి) వంటి కీలక నేతలు బిఆర్ఎస్ పార్టీకి బై బై చెప్పి..కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
నిన్న ఇంద్రకరణ్ రెడ్డి పెద్దన్న చనిపోవడంతో పరామర్శించేందుకొచ్చారు సుదర్శన్‌రెడ్డి. ఆ సమయంలో కాంగ్రెస్ లో చేరికపై పెద్దిరెడ్డి తో..ఇంద్రకిరణ్ రెడ్డి చర్చలు జరిపినట్టు సమాచారం. దీనికి ఇంద్రకరణ్ రెడ్డి సానుకూలంగా స్పందించారని.. కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన అంగీకరించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తారని అంటున్నారు. ఇప్పటికే సన్నిహితులతో, ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమై ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక గురించి చర్చించారని తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్యే గా కొనసాగుతున్న కొంతమంది కూడా కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్నారని వినికిడి. ఏది ఏమైనప్పటికి పదేళ్ల పాటు షాక్ అంటే తెలియని కేసీఆర్ కు ఇప్పుడు మాత్రం వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి.
Read Also : CM Revanth : కేసీఆర్ కు రేవంత్ సవాల్ ..