Site icon HashtagU Telugu

Telangana: ఇందిరాగాంధీ రాక్షస పాలన : కేసీఆర్

Telangana

Telangana

Telangana: ఇందిరాగాంధీ హయాంలో ఆకలి చావులు, నక్సల్స్ ఉద్యమాలు, ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా కొల్లాపూర్ వద్ద కృష్ణానది ప్రవహిస్తున్నా తాగునీరు ఇవ్వలేకపోయిన కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేసిందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే కాకుండా బీఆర్‌ఎస్ పార్టీని చీల్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది, ఇందిరమ్మ రాజ్యంలో ఏమి జరిగింది? ఆకలి చావులు, నక్సలైట్ల ఉద్యమాలు, ప్రజలను కాల్చి చంపడం, ఎన్‌కౌంటర్‌లు, ఇందిరమ్మ రాజ్యమంతా ఇదే జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.

సీనియర్ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి ప్రజలకు కిలో రూ.2లకే బియ్యం అందించే వరకు, కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆకలితో అలమాటించారని చెప్పారు. ఇందిరమ్మ పాలన కంటే దారుణమైన పాలన లేదని, దోచుకుని ప్రజలను మభ్యపెట్టారని సీఎం అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనతో పోల్చి చూడాలని, బీఆర్ఎస్ అభివృద్ధిని ప్రజలు స్వయంగా చూడాలని కేసీఆర్‌ కోరారు.

Also Read: Tollywood: తల్లి పాత్రలకు సై అంటున్న బ్యూటీలు, హద్దులు చెరిపేస్తున్న హీరోయిన్లు