ఇండిగో ఫ్లైట్ లో ఓ తెలుగు ప్రయాణికురాలికి జరిగిన అవమానంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈనెల 16 వ తేదీన విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న మహిళకు ఇంగ్లీష్, హిందీ రాదన్న కారణంలో ఫ్లైట్ లో ఆమె సీటు మార్చడాన్ని తప్పు పడుతూ ట్విట్టర్ లో ఓ ప్రెఫెసర్ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇండిగో సిబ్బందిని ట్యాగ్ చేస్తూ…హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడటం రానంత మాత్రాన వాళ్లను అవమానపర్చడం సరికాదని ట్వీట్ చేశారు. ప్రాంతీయ భాషను మాట్లాడే సిబ్బందిని నియమించుకోవాలంటూ ఇండిగోకు సూచించారు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. ఇండిగో ఫ్లైట్ సర్వీసు సంస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
https://twitter.com/DevasmitaTweets/status/1571014493693681665?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1571014493693681665%7Ctwgr%5Eaa95cec58e1c8f9c613fd18f0f1220510d1d76ae%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Ftelangana%2Fhyderabad-telangana-minister-ktr-response-to-the-insult-meted-out-to-telugu-passengers-in-indigo-flight-snr-1444098.html