White House : అమెరికాలో భారతీయ సంతతికి చెందిన యువకుడు సాయి కందుల వైట్ హౌస్‌పై దాడికి పాల్పడినందుకు ఎనిమిదేళ్ల జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. కోర్టు పత్రాల ప్రకారం, సాయి కందుల తన నేరాన్ని అంగీకరించడమే కాకుండా, తన ప్రణాళికలు, కారణాలను కూడా బయటపెట్టాడు. అతని దాడి వెనుక లక్ష్యం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించడమే అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
సాయి కందుల వయసు 20 సంవత్సరాలు. అతను భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని చందానగర్ ప్రాంతంలో జన్మించాడు. ప్రస్తుతం గ్రీన్ కార్డ్‌తో అమెరికాలో నివసిస్తున్న సాయి, మిస్సోరీ రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో జీవనం గడుపుతున్నాడు. అతని చర్యలు అమెరికా, భారతీయ సమాజంలో తీవ్ర చర్చకు దారితీసాయి.
Nitish Kumar Reddy: క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి రూ.25 లక్షల చెక్ అందించిన సీఎం
ఈ సంఘటన మే 22, 2023న జరిగింది.. కోర్టు పత్రాల ప్రకారం:
సాయి కందుల మిస్సోరీలోని సెయింట్ లూయిస్ నుండి వాషింగ్టన్ DCకి వాణిజ్య విమానంలో బయలుదేరాడు. సాయంత్రం 5:30 గంటలకు డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అతను, గంట తర్వాత ట్రక్కు అద్దెకు తీసుకున్నాడు. రాత్రి 9:35 గంటలకు వైట్ హౌస్ వెలుపల ఉన్న బారికేడ్లపైకి ట్రక్కును ఢీకొట్టాడు. దాడి అనంతరం అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు. సాయి కందుల తన ట్రక్కు నుంచి దిగి వెనుక భాగం నుంచి ఒక నాజీ జెండాను తీశాడు. ఆ జెండాను అక్కడ ఎగురవేసి, పాశవికతను ప్రదర్శించాడు. ఈ మొత్తం చర్య భద్రతా సిబ్బంది దృష్టికి రావడంతో వారు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
దాడి వెనుక ప్రణాళిక
సాయి కందుల ఈ దాడికి నాలుగు వారాల పాటు ప్రణాళికలు రచించినట్లు వెల్లడైంది. అతను కొన్ని రోజులు ముందే వైట్ హౌస్‌లోకి ప్రవేశించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. వీటిలో విఫలమైన తర్వాత ట్రక్కుతో దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. నిందితుడు నాజీ భావజాలంతో తీవ్రంగా ప్రభావితమయ్యాడని విచారణలో తేలింది. అతని ఆలోచనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉండటమే కాకుండా, అతని చర్యలు అమెరికా భద్రతకు ముప్పుగా మారాయి. కోర్టు అతని చర్యలను తీవ్రంగా ఖండించి, జైలు శిక్ష విధించింది.
సాయి కందుల చర్యలు , తీర్పు భారతీయ సంతతి వ్యక్తుల గురించి అమెరికాలో వివిధ విధాలుగా చర్చకు దారితీసాయి. ఈ ఘటన ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా భద్రతా చర్యల ప్రాముఖ్యతను మరింత స్పష్టంగా చూపుతోంది.