Site icon HashtagU Telugu

UNESCO : ప్రపంచ వారసత్వ రేసులో ‘నిలువురాళ్లు’.. ఎలా నిలబడ్డాయి? ఏం చేస్తాయి ?

Niluvu Rallu Site Megalithic Menhirs Mudumal Village Telangana Unesco Indian Govt

UNESCO : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలంటూ ఆరు ప్రదేశాల పేర్లను యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో‌)కు భారత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ లిస్టులో తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్‌ గ్రామంలో ఉన్న నిలువురాళ్లకు కూడా చోటు దక్కింది. మన దేశంలో ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన 56 వారసత్వ కేంద్రాలు ఉన్నాయి. తాజాగా  భారత సర్కారు పంపిన ఆరు ప్రదేశాలకు కూడా చోటు దక్కుతుందా ? లేదా ? అనేది వేచిచూడాలి. ఈసందర్భంగా ముడుమాల్ నిలువు రాళ్ల విశేషాలను తెలుసుకుందాం..

Also Read :Neem Leaves: వేప ఆకులను నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?

ఏమిటీ నిలువురాళ్లు ? ఎందుకివి ? 

  • ప్రపంచ వారసత్వ ప్రదేశాలను గుర్తించేందుకు  యునెస్కో ముమ్మర కసరత్తు చేస్తుంది.  ఇందుకోసం ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తుంది.  వివిధ దేశాలు ఈ ఓటింగ్‌లో పాల్గొంటాయి. అధిక దేశాల మద్దతు పొందే ప్రదేశాలకే ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు లభిస్తుంది.
  • ఒకవేళ నిలువురాళ్లకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభిస్తే, ఇక్కడికి విదేశీ పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. టూరిజం వికసిస్తుంది.