Site icon HashtagU Telugu

Wings India 2022: భారత విమాన సేవలు వేగం

Aviation Imresizer Imresizer

Aviation Imresizer Imresizer

భారత విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెంద డానికి అవకాశం ఉంది. సవాళ్ళను ఎదుర్కొని ఏడాదికి కనీసం 100 కొత్త విమానాలను తీసుకురావడానికి విమానయాన శాఖ ప్లాన్ చేస్తోంది. ఆ విషయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి సిందియా వెల్లడించాడు. వాటాదారులతో కేంద్రం నిర్మాణాత్మక సహకారిగా ఉంటుందని ప్రకటించాడు. దేశంలో పౌర విమానయాన అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుందని ఆ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నాడు.
బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2022ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా సింధియా మాట్లాడాడు. కోవిడ్ కాలంలో భారత విమానయాన రంగం పడిన ఇబ్బందుల నుండి బయటపడిందని, సవాళ్లను ఎదుర్కొనేందుకు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నాడు.
వచ్చే ఏడాది నాటికి దేశీయ ప్రయాణీకుల సంఖ్యను కోవిడ్‌ ముందులా అధిగమిస్తాము. అంతర్జాతీయ విమానాలు రెండు రోజుల్లో పూర్తిగా పునఃప్రారంభించబోతున్నాయని, భారతదేశం నుండి అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతుందని ఆయన చెప్పారు.
గత 7 సంవత్సరాలలో భారత పౌర విమానయాన రంగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్ అని అన్నారు. 2013-14లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుండి దాదాపు 140కి (హెలిపోర్ట్‌లు మరియు వాటర్ డోమ్‌లతో సహా) పెరగడంతో ఈ రంగం స్పెక్ట్రమ్ అంతటా విస్తరిస్తోంది. 2024-25 నాటికి ఈ సంఖ్య 220కి పెరిగే అవకాశం ఉంది. దేశంలో అప్పట్లో 400 విమానాలు ఉండేవని, 7 ఏళ్లలో వాటి సంఖ్య 710కి చేరుకుందని, ప్రతి ఏడాది 100కు పైగా విమానాలు చేరాలని సంకల్పించామని చెప్పారు.
లాస్ట్-మైల్ కనెక్టివిటీని అందించడంతో పాటు ప్రాంతీయ కనెక్టివిటీపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఉడాన్ ప్రతి ఒక్క పౌరుడిని కనెక్ట్ చేయడానికి,సామాన్యులకు విమానాలను అందుబాటులోకి తీసుకురావడానికి 409 కంటే ఎక్కువ మార్గాలను గుర్తించామని సింధియా చెప్పారు.