IndiaTv Survey : ఇండియా టీవీ సంచ‌ల‌న స‌ర్వే! జ‌గ‌న్ హ‌వా, కేసీఆర్ ఔట్‌!!

ఇండియా టీవీ తాజా స‌ర్వే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప‌బ్లిక్ మూడ్ ను స్ప‌ష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా క‌మ‌ల వికాసం ఉంటుంద‌ని అంచ‌నా వేసింది.

  • Written By:
  • Publish Date - July 30, 2022 / 11:44 AM IST

ఇండియా టీవీ తాజా స‌ర్వే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప‌బ్లిక్ మూడ్ ను స్ప‌ష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా క‌మ‌ల వికాసం ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌వా ఇంకా కొన‌సాగుతుంద‌ని స‌ర్వే చెబుతోంది. దేశ వ్యాప్తంగా మ‌రోసారి ఎన్డీయే అధికారంలోకి వ‌స్తుంద‌ని మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వేను ఇండియా టుడే ప్ర‌క‌టించింది.

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కనిపించింది. అయితే 2019తో పోల్చితే ఆ పార్టీకి సీట్లు త‌గ్గుతాయ‌ని అంచ‌నా వేసింది. ఆ ఎన్నిక‌ల్లో 23 లోక్ స‌భ స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న వైసీపీ ఈసారి 19 సీట్లకు ప‌రిమితం అవుతుంద‌ని స‌ర్వే చెబుతోంది. గత ఎన్నికల్లో మూడు సీట్లు సాధించిన టీడీపీ ఈసారి ఆరు ఎంపీ సీట్లు గెలుస్తుందని సర్వే వెల్లడించింది. ఏపీలో బీజేపీ ఖాతా తెరవదని సర్వేలో స్పష్టమైంది. అయితే ఇండియా టుడే సర్వేలో జనసేన ప్రస్తావనే లేదు. ఓట్ల శాతం కూడా వైసీపీకి గతంలో కన్నా కొంత తగ్గనుందని తేల్చిడం గ‌మ‌నార్హం.

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పై ప్రజాగ్రహం తీవ్రంగా ఉందనే జరుగుతోన్న ప్ర‌చారానికి అనుగుణంగా ఇండియా టీవీ సర్వేలోనూ అదే స్పష్టమైంది. 2019 గంటే ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు దాదాపు 8 శాతం ఓట్లు తగ్గనున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇది దాదాపు 12 శాతంగా ఉంది. ఎంపీ సీట్ల విషయానికి వస్తే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 9 సీట్లు గెలవగా, ఇప్పుడు ఎన్నికలు జరిగితే 8 సీట్లు వస్తాయని సర్వే అంచ‌నా వేసింది. గతంలో కంటే రెండు సీట్లు అధికంగా మొత్తంగా బీజేపీకి 6 సీట్లు రానున్నాయి. 2019లో కాంగ్రెస్ మూడు సీట్లు గెలవగా, ఈసారి కేవలం రెండు వస్తాయని లెక్కించింది. హైదరాబాద్ సీటును ఎంఐఎం నిలబెట్టుకోనుందని ఇండియా టీవీ సర్వేలో స్పష్టమైంది. ఓట్ల శాతం చూస్తే 2019 లోక్ సభ ఎన్నిక్లలో టీఆర్ఎస్ కు 42 శాతం ఓట్లు రాగా, ఈసారి తాజా సర్వేలో అది 34 శాతానికి పడిపోయింది. బీజేపీకి 2019లో కేవలం 20 శాతం ఓట్లు రాగా తాజా సర్వేలో అది ఏకంగా 39 శాతానికి పెరిగింది. బీజేపీ ఓటింగ్ 19 శాతం పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి 2019 లోక్ సభ ఎన్నికల్లో 30 శాతం ఓట్లు రాగా తాజా సర్వేలో అది కేవలం 14 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ ఓట్ల శాతం ఏకంగా 16 శాతం తగ్గింది.

ఇప్ప‌టికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స‌ర్వే తేల్చింది. మొత్తం 543 లోక్ సభ సీట్లుగాను, ఎన్డీఏ కూటమి 362 సీట్ల కైవ‌సం చేసుకుంటుంద‌ని ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. 2019 ఎన్నికల్లో బీజేపీ అలయన్స్ కు వ‌చ్చిన 353 సీట్ల కంటే ఈసారి ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని తేల్చింది. యూపీఏ కూటమికి వందలోపే సీట్లు ఉంటాయ‌ని స‌ర్వే లెక్కిస్తోంది. యూపీఏకు కేవలం 97 సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వేలో తేలింది. దేశ వ్యాప్త‌వంగా కాంగ్రెస్ కు కేవలం 39 సీట్లు వస్తాయని స్పష్టమైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 52 లోక్ సభ సీట్లు వచ్చాయి. యూపీఏ కూటమిలో తమిళనాడులోని డీఎంకేకు 25 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. బెంగాల్ లోని అధికార టీఎంసీ పార్టీకి 26 సీట్లు రానుండగా, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 6, ఎస్పీకి కేవలం రెండు లోక్ సభ సీట్లు మాత్రమే వస్తాయని సర్వే ఫలితాల్లో తేలింది. ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ పార్టీకి ఐదు సీట్లు వస్తాయని అంచ‌నా వేసింది. యూపీలో మొత్తం 80 సీట్లకు బీజేపీకే 76 సీట్లు వస్తాయని సర్వేలో వెల్ల‌డి కావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

`దేశ్ కా ఆవాజ్ ` పేరుతో నిర్వహించిన సర్వే ఫలితాలను ఇండియా టీవీ విడుదల చేసింది. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చింది. రాష్ట్రాల వారీగా సర్వే ఫలితాలను రిలీజ్ చేసింది. ఇండియా టుడే దేశ్ కా ఆవాజ్ సర్వేలో సంచలన ఫ‌లితాల‌ను వెలువ‌రించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓట్ల శాతాన్ని కోల్పోతుంద‌ని చెబుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల భ‌విష్య‌త్ తో పాటు దేశ భ‌విష్య‌త్ ను నిర్ణ‌యించే 2023, 2024 సాధార‌ణ‌ ఎన్నిక‌ల క్ర‌మంలో ఇండియా టుడే వెల్ల‌డించిన స‌ర్వే ఫలితాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మార‌డంతో పాటు దుమారం రేపుతున్నాయి.