తెలంగాణ ఎన్నికల ఫలితాలు (Telangana Poll 2023) మరికొద్ది గంటల్లో వెల్లడికాబోతున్నాయి. ఇప్పటికే అనేక పోల్ సంస్థలు కాంగ్రెస్ విజయం సాదించబోతుందని తేల్చి చెప్పాయి. కానీ అధికార పార్టీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ లెక్క తప్పువుతాయని..గెలిచేది మీమే రాసిపెట్టుకోండని ధీమా వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఇండియా టుడే (India today) సైతం కాంగ్రెస్ పార్టీకే జై కొట్టింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇండియా టుడే (India today) తెలిపిన ప్రకారం..
బీఆర్‌ఎస్ – 34-44
కాంగ్రెస్ – 63-73
బీజేపీ – 4-8
ఇతరులు – 5-8 సాదించబోతున్నట్లు తెలిపింది. ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే..బీఆర్ఎస్ పార్టీకి రూరల్‌లో 35 (గతంలో కంటే 13 శాతం తగ్గుదల(-13)) శాతం, పట్టణ ప్రాంతంలో 36(-10) శాతం పోలింగ్ నమోదైంది.
కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతంలో 44(+9) శాతం, పట్టణ ప్రాంతంలో 41(+14) శాతం పోలింగ్ నమోదైంది.
బీజేపీకి గ్రామీణ ప్రాంతంలో 14 (+8), పట్టణ ప్రాంతంలో 15 (+6) శాతం.
ఎంఐఎం పార్టీకి గ్రామీణ ప్రాంతంలో ఏమీ లేదు. పట్టణ ప్రాంతంలో 7 శాతం పోలింగ్.
ఇతరులకు గ్రామీణ ప్రాంతంలో 7 (-4) శాతం, పట్టణ ప్రాంతంలో 1 (-10) శాతం పోలింగ్ నమోదైంది.
Read Also : T20I : నాలుగో టీ ట్వంటీ మనదే..సిరీస్ కైవసం