Site icon HashtagU Telugu

Traffic Restrictions: మ్యాచ్ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!

Traffic Hyderabad

Traffic Hyderabad

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 7 గంటలకు జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ 20 మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉప్పల్ స్టేడియం వైపు వెళ్ళే అన్ని మార్గాలో ఎటువంటి వాహనాలను అనుమతించరు. వాహనదారులు ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇక మ్యాచ్‌ చూడటానికి అంబర్‌పేట వైపు నుంచి వచ్చే వీఐపీ వాహనాలు దూరదర్శన్, రామాంతపూర్ మీదుగా వచ్చి స్ట్రీట్ నెంబర్ 8 వద్ద ఎడమ వైపునకు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్ద దిగి వాహనాలను పార్కింగ్ ఏ, సీ ల వద్ద నిలపాలి. తార్నాక మీదుగా వచ్చే వీఐపీ వాహనాలు హబ్సీగూడ, ఎన్జీఆర్ఐ మీదుగా వచ్చి ఏక్ మినార్ వద్ద కుడి వైపునకు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్దకు వెళ్ళాలి. అక్కడ‌ వాహనాలను ఏ, సీ ల వద్ద నిలపాలి. నాగోల్, వరంగల్ హైవే నుంచి వచ్చే వీఐపీ వాహనాలు ఉప్పల్ చౌరస్తా, సర్వే ఆఫ్ ఇండియా మీదుగా వచ్చి ఏక్ మినార్ వద్ద ఎడమ వైపు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్దకు చేరుకోవాలని పోలీసులు తెలిపారు.