Site icon HashtagU Telugu

Eggs Rates: పెరిగిన కోడిగుడ్ల ధరలు.. చుక్కలు చూపిస్తున్న రేట్లు!

Egg Prices

Up Egg Shortage

Eggs Rates: ఇతర ధరల పెరిగినా. గుడ్డు రేట్లు మాత్రం సామాన్యులకు ప్రతిఒక్కరికి అందుబాటులో ఉంటాయి. కానీ ప్రస్తుతం ఒక్కో కోడి గుడ్డు ధర 7 రూపాయలు పలుకుతోంది. కోళ్ల దాణా ధరలు పెరగడమే గుడ్డు రేటు పెరగడానికి కారణమంటున్నారు కోళ్లఫారమ్‌ నిర్వాహకులు. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.5.50 గా ఉంది. ఈ ధర వారం రోజుల క్రితం రూ.6కు చేరుకుంది. ఇప్పుడు కోడిగుడ్డు ధర రూ.7 పలుకుతోంది.

వారం రోజుల్లోనే డజన్ల గుడ్ల ధర రూ.72 నుంచి రూ.84కు చేరుకుంది. ఇక హోల్‌సేల్‌లో కూడా ఒక్కో గుడ్డు ధర రూ.5.76గా ఉంది. తెలంగాణ కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మూడో ప్లేస్‌లో ఉంది. రాష్ట్రంలో ఏటా 17.67 బిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కొన్ని రోజుల నుండి చలి పెరగడంతో కోళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. దీని కారణంగానే గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు.

దాణా ఛార్జీలు పెరగడం, వాహనదారులు గత రెండు నెలల్లో రవాణా ఖర్చులు 15 శాతం పెంచడం వల్ల గుడ్ల ధర పెరిగిందని చెబుతున్నారు. గత 20 రోజులుగా చలి పెరగడంతో కోళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని, ఫలితంగా గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిందని పెంపకందారులు అంటున్నారు. గతంలో కిలో చికెన్‌ రూ.170గా ఉంటే.. ఇప్పుడు రూ.240 కి చేరింది.

Also Read: Corona: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, తాజా కేసులు ఎన్నంటే!