IT Officials Raids : హైదరాబాద్ లో ఐటీ తనిఖీలు

IT Officials Raids : కొల్లూరు (Kollur ), రాయదుర్గం (Rayadurg ), ఐటీ కారిడార్‌లోని విజయవాడకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
It Rides

It Rides

హైదరాబాద్ (Hyderabad) లో ఐటీ దాడులు (IT Officials Simultaneous Raids) కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ లోని 30 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ (Googee Properties, Anvita Builders) లో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌ తో పాటు రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. కొల్లూరు (Kollur ), రాయదుర్గం (Rayadurg ), ఐటీ కారిడార్‌లోని విజయవాడకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ చైతన్యపురిలోని గూగి ప్రాపర్టీస్‌ అండ్‌ డెవలపర్స్ కార్యాలయంతో పాటు, మలక్‌పేటకు చెందిన కాంగ్రెస్‌ నేత షేక్‌ అక్బర్‌ ఇండ్లలో, అతని 15 గూగి ప్రాపర్టీస్‌ ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

అన్విత బిల్డర్స్‌ అధినేత బొప్పన అచ్యుతరావుతోపాటు ఆయన కుటుంబ సభ్యులైన బొప్పన శ్రీనివాసరావు, బొప్పన అనూస్‌ ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, ఎవ్వరిని బయటికి వెళ్లనీయకుండా పటిష్టమైన భద్రత నడుమ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో గత నెల 23వ తేదీన విస్తృతంగా ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Read Also : Delhi Capitals: గంగూలీకి ఢిల్లీ క్యాపిట‌ల్స్ షాక్‌.. డీసీ డైరెక్ట‌ర్‌గా కొత్త వ్య‌క్తి?

  Last Updated: 17 Oct 2024, 10:16 AM IST