Site icon HashtagU Telugu

IT Raids : దిల్‌‌రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు

Dil Raju Income Tax Department It Raids

IT Raids : తెలంగాణ అకస్మాత్తుగా ఐటీ రైడ్స్ కలకలం రేగింది. ఇవాళ(మంగళవారం) తెల్లవారుజాము నుంచే ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌‌రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను విభాగం అధికారుల  తనిఖీలు జరుగుతున్నాయి. ఏకకాలంలో హైదరాబాద్‌లో 8 చోట్ల 55 ఐటీ విభాగం టీమ్‌లు రైడ్స్ చేస్తున్నాయి. దిల్‌ రాజు సోదరుడు శిరీశ్‌, కుమార్తె హన్సితరెడ్డి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ రైడ్స్  చేస్తున్నారు.  బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు(IT Raids) జరుగుతున్నట్లు తెలిసింది. ఈక్రమంలో ఆయా చోట్ల వివిధ డాక్యుమెంట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటీవలే దిల్ రాజు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా దాదాపు రూ.200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇంతలోనే ఐటీ రైడ్స్ జరగడం గమనార్హం.

Also Read :Midday Meal Scheme : ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. ఎందుకంటే ?

వసూళ్లలో దూసుకుపోతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’