Inauguration Of Rajiv Gandhi Statue : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం (BR Ambedkar Secretariat) ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని (Rajiv Gandhi Statue) సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జి దీపా దాస్‌మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ పాల్గొన్నారు. అలానే పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ (CM Revanth ) మాట్లాడుతూ… ఒక పక్క సచివాలయం, మరో వైపు అమరవీరుల స్థూపం. ట్యాంక్ బండ్‌పై ఎంతోమంది త్యాగమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో తాను పర్యటిస్తున్నప్పుడు ఒక లోటు ఉందని గుర్తించామని, అదే రాజీవ్ గాంధీ విగ్రహం లేకపోవడమని..అందుకే సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రాజీవ్ గాంధీ విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు
ఇక సచివాలయం ఎదుట ఆవిష్కరించబోయే రాజీవ్ గాంధీ విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఏ కార్యక్రమానికి వెళ్లినా.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎంతో ఆదర అభిమానాలు చూపించేవారు. ఎదురు వచ్చి పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకునేవారు. వేదిక పైనా ఆయనకు పూలమాలలు వేసి సత్కరించేవారు. కానీ, రాజీవ్ గాంధీ ఆ పూలమాలలను మెడలో ఉంచుకునేవారు కాదు. ప్రజలు చూపించిన ఆ అభిమానాన్ని తిరిగి వారిపైనా కురిపించేవారు. ఇందులో భాగంగా ఆయన ఆ పూల మాలలను తిరిగి అభిమానులు, ప్రజలపైనకు విసిరేసేవారు. అందుకే ఈ విగ్రహం కూడా పూలమాలను ఎదుటి వారి మెడలో పడే విధంగా విసిరేస్తున్నట్టుగా ఉన్నది. ఇలాంటి విగ్రహం ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేదు.
Read Also : Kejriwal: రేపే కేజ్రీవాల్ రాజీనామా.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అపాయింట్‌మెంట్!