Site icon HashtagU Telugu

TS : చిచ్చు పెట్టిన ప్రేమ వివాహం…అబ్బాయి ఇంటికి నిప్పు..!!

4 killed In Fire

Fire

ప్రేమ పెళ్లి…అబ్బాయి ఇంటిని తగలబెట్టేలా చేసింది. ప్రేమ పెళ్లి చేసుకున్నారని కోపంతో రగిలిపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులు..అబ్బాయి ఇంటిని తగలబెట్టారు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలోని జగదేవ్ పూర్ మండలంలోని గంధమల్లలో చోటుచేసుకుంది. వేముల భాను అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలను వాట్సాప్ షేర్ చేశాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు కోపంతో ఊగిపోయారు. తమ కూతురు వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందని…అబ్బాయి ఇంటిని తగలబెట్టారు.

అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేస్తారని భయపడిన అబ్బాయి కుటుంబ సభ్యులు ఇళ్లు వదిలి పారిపోయారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇల్లు మాత్రం పాక్షికంగా ద్వంసం అయ్యింది. ఈ ఘటనతోగ్రామంలో ఉద్రికత్త నెలకొంది. ఘటనకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.