Bandla Ganesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమాని, తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఎదీ మాట్లాడినా సంచలనమే అవుతుంది. ఆ మధ్య 7ఓ క్లాక్ బ్లేడ్, ఆ తర్వాత ఈశ్వరా పరమేశ్వరా స్పీచ్‌లు ఎంతలా పాపులర్ అయ్యాయో మనకు తెలిసిందే. తెలంగాణలో సీఎం రేవంత్ అనుచరుడిగా పేరొందాడు. అయితే బండ్ల నిర్మాతగానే చేస్తూ పౌల్ట్రీ వ్యాపారంలో కూడా తనదైన ముద్ర వేశాడు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
భవిష్యత్తులో అమెరికాకి ప్రెసిడెంట్ ఒక కమ్మ వాడు అవుతాడు
బోరులో పడ్డ బయటికి రాగల కెపాసిటీ ఉన్నవాడే కమ్మ వాడు
కమ్మ వాడికి మోసం, అన్యాయం చేయటం రాదు.. కమ్మ వాడికి కష్ట పడటం ఒకటే వచ్చు
కమ్మ వాడిగా పుట్టినందుకు గర్విస్తాం.. కమ్మ వాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం.
మన కమ్మ కులంలో లేని… pic.twitter.com/alqkqMUZy8
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2024
తాజాగా మాదాపుర్‌లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్‌లో నిర్మాత బండ్ల గణేష్ ప్రసంగించారు. ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలే తెగ వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్ ఏమన్నారంటే.. భవిష్యత్తులో అమెరికాకి ప్రెసిడెంట్ ఒక కమ్మ వర్గానికి చెందిన వ్యక్తి అవుతాడని హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా బోరులో పడ్డ బయటికి రాగల కెపాసిటీ ఉన్నవాడే కేవలం కమ్మ వారికి మాత్రమే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కమ్మ వారికి మోసం, అన్యాయం చేయటం రాదని, కేవలం కష్ట పడటం ఒక్కటే వచ్చని బండ్ల పేర్కొన్నారు.
Also Read: Cancer Risk: క్యాన్సర్ బాధితులకు బిగ్ రిలీఫ్.. ఉపవాసం ఉంటే రిస్క్ తగ్గుతుందట..!
కమ్మ వాడిగా పుట్టినందుకు గర్విస్తామని, కమ్మ వాడిగా పుట్టినందుకు ఆనందిస్తామని హాట్ కామెంట్స్ చేశారు. కమ్మ కులంలో లేని పిల్లలను ఆదుకొని సాయం చేయండి. అప్పుడే మన కులం ఉన్నత స్థాయిలో ఉంటుందని అన్నారు. రవి అస్తమించని ప్రతిదేశంలో కమ్మ వాడు జెండా ఎగరేస్తున్నాడని తెలిపారు. ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావని లేపేవాడు.. అవసరం అయితే సూట్ విప్పి నాటు వేసేవాడు.. ఆకాశం వైపు కసిగా చూసేవాడు.. అవకాశం కోసం ఆశగా ఎదురు చూసే వాడు కమ్మ వాడని సినిమా లెవెల్లో డైలాగ్స్ చెప్పారు. కమ్మొడు అంటే కష్టపడే వాడు.. కమ్మొడు అంటే కసితో బతికే వాడు.. కమ్మొడు అంటే కడుపులో ఉన్నది తీసి పెట్టే వాడు.. కమ్మొడు అంటే ఎక్కడ బతుకుదెరువు ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లే వాడు అని బండ్ల సర్టిఫికేట్ ఇచ్చేశారు. అయితే బండ్ల మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
