HSRP Features: ఏమిటీ.. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ ? ఫీచర్స్ ఏమిటి ?

మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వాహన నంబర్ ప్లేట్‌లను ప్రామాణీకరించాలనే ఉద్దేశంతో  హై సెక్యూరిటీ నంబర్(HSRP Features) ప్లేట్లను తీసుకొచ్చారు.

Published By: HashtagU Telugu Desk
High Security Registration Plate Hsrp Features telangana Old Vehicles Siam

HSRP Features:  తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు బిగ్ అలర్ట్. 2019 ఏప్రిల్‌ 1 కంటే ముందు తయారైన వాహనాలను వినియోగించే వారు అప్రమత్తం కావాలి. ఎందుకంటే వారంతా  ఈ ఏడాది సెప్టెంబరు 30లోగా తమ వాహనాలకు  హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ (HSRP) బిగించుకోవాలి.ద్విచక్ర వాహనం నుంచి నాలుగు చక్రాల బండ్ల దాకా అన్నింటికీ ఈ రూల్ వర్తిస్తుంది. వాహన రకాన్ని బట్టి నంబర్‌ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320 నుంచి గరిష్ఠంగా రూ.800 దాకా ఛార్జీని వసూలు చేస్తారు.

Also Read :Baba Ramdev : ‘షర్బత్ జిహాద్’ .. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు

ఏమిటీ.. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌  ?

  • 2019 ఏప్రిల్ 1 నుంచి మన దేశంలో విక్రయిస్తున్న అన్ని రకాల వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ)లను మాత్రమే అమరుస్తున్నారు.
  • వాహనానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేయడం అనేది శిక్షార్హమైన నేరం. ఇలా చేస్తే ట్రాఫిక్ పోలీసులు మీకు రూ. 10,000 వరకు జరిమానా విధిస్తారు. భవిష్యత్తులో ఈ రూల్‌ను కఠినంగా అమలు చేయనున్నారు.
  • హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను అల్యూమినియంతో తయారు చేస్తారు. బలమైన స్నాప్ స్క్రూలతో దీన్ని వాహనానికి బిగిస్తారు. దీనివల్ల ట్యాంపరింగ్ చేయకుండా ఇక ఆ నంబర్ ప్లేటును తొలగించడానికి వీలుండదు.

  • హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌‌పై వాహన నంబరు ఉంటుంది.  ఎడమ వైపున భారతదేశ కంట్రీ కోడ్ ‘IND’ ఉంటుంది. ప్రతీ హై సెక్యూరిటీ నంబర్ ప్లేటుకు ఒక నిర్దిష్ట సీరియల్ నంబరు ఉంటుంది. ఇది నంబర్ ప్లేట్‌లోని కుడి మూలలో దిగువ భాగంలో ఉంటుంది. ఈ సీరియల్ నంబరు లేజర్‌తో చెక్కబడి ఉంటుంది. ఇది ముందు, వెనుక నంబరు ప్లేట్లకు భిన్నంగా ఉంటుంది. క్రోమియం ఆధారిత అశోక చక్ర చిహ్నం నంబర్ ప్లేటు ఎడమ భాగం ఎగువ మూలలో హోలోగ్రాఫిక్ పద్ధతిలో ఉంటుంది.

  • కార్లలో ముందు భాగం, వెనుక భాగంలో నంబర్ ప్లేటు ఉంటాయనే విషయం మనకు తెలుసు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌‌ అనేది కారు లోపలి విండ్ షీల్డ్‌కు కూడా అతికించి ఉండాలని కొత్త రూల్స్ చెబుతున్నాయి. కలర్ కోడెడ్ నంబర్ ప్లేటు స్టిక్కరును విండ్ షీల్డ్‌పై డిస్‌ప్లే చేయాలని అంటున్నారు.

Also Read :Shock To Masood Azhar: పాపం పండుతోంది.. ఉగ్రవాది మసూద్ అజర్‌ సన్నిహితుడి మర్డర్

ఎందుకీ.. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌  ?

  • మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వాహన నంబర్ ప్లేట్‌లను ప్రామాణీకరించాలనే ఉద్దేశంతో  హై సెక్యూరిటీ నంబర్(HSRP Features) ప్లేట్లను తీసుకొచ్చారు. అన్ని వాహనాల నంబర్లకు ఒకే రకమైన ఫాంట్‌ను, సైజును వినియోగిస్తారు.
  • రాత్రిపూట వాహనం ఇతర వాహనదారులకు కనిపించేలా చేయడానికి నంబర్ ప్లేట్లపై రేడియం లాంటి మెరిసే పదార్థాన్ని ఉపయోగించారు. దీనివల్ల వాహన భద్రత పెరుగుతుంది.
  • హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు RFID ట్యాగ్‌‌ను కలిగి ఉంటాయి. ఫలితంగా భద్రతా ప్రయోజనాల కోసం వాటిని ట్రాక్ చేయొచ్చు.
  • ఆర్ఎఫ్‌ఐడీ అంటే.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్.  దీని ద్వారా పోలీసులు సదరు వాహనం ఎక్కడ ఉందనేది ఈజీగా ట్రాక్ చేయగలరు.
  • హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను నకిలీవి తయారు చేయించి వాడటం అసాధ్యం. దీనివల్ల తప్పుడు నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలతో  దుండగులు అసాంఘిక చర్యలకు పాల్పడటం ఆగుతుంది.
  • వాహనాల దొంగతనాలకు అడ్డుకట్ట పడుతుంది. దొంగతనం జరిగినా నంబర్ ప్లేటుపై ఉండే RFID ట్యాగ్‌‌‌తో ట్రాక్ చేస్తారు.
  • హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల బేస్‌లో ఆకుపచ్చ రంగు ఉంటుంది. దీనివల్ల రాత్రిటైంలోనూ ట్రాఫిక్ పోలీసుల కెమెరాలు రిజిస్ట్రేషన్ నంబరును ఈజీగా గుర్తిస్తాయి.
  Last Updated: 10 Apr 2025, 11:15 AM IST