Agnipath Violence: సికింద్రాబాద్ లో రైలు బోగీకి నిప్పు.. 40 మందిని ఇలా రక్షించారు!

"అగ్నిపథ్" స్కీంపై నిరసనలు ఉధృతం అవుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా శుక్రవారం రణ రంగంగా మారింది.

  • Written By:
  • Publish Date - June 18, 2022 / 12:05 AM IST

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన
“అగ్నిపథ్” స్కీంపై నిరసనలు ఉధృతం అవుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా శుక్రవారం రణ రంగంగా మారింది.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు..కనీసం 5,000 మంది ఆందోళన కారులు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి 40 మంది ప్రయాణికులతో ఉన్న ప్యాసింజర్ రైలు కోచ్‌కు నిప్పుపెట్టడానికి యత్నించారు. నిప్పుపెట్టగానే రైల్వే సిబ్బంది స్పందించి.. వారందరినీ పక్కనే ఉన్న కోచ్‌లోకి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఏ1 కోచ్‌పై నిరసనకారులు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సమయంలో కనీసం 40 మంది ప్రయాణికులు లోపల ఉన్నారని గుర్తించారు.

40 మందిని ఎలా కాపాడారంటే..?

ఆందోళనకారులు కోపంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. ఏ1 రైల్వే కోచ్‌ కు నిప్పంటించే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది ఆ కోచ్ లోని 40 మంది ప్రయాణికులను వేరే కోచ్ లోకి తరలించారు. హింసాత్మక ఘటనల మధ్య.. సాహసోపేతంగా వ్యవహరించి ప్రయానికులను కోచ్ నుంచి బయటికి తరలించారు.
ఆ సమయానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని రెండు ప్రధాన గేట్లు కూడా తెరిచి ఉండటం కలిసొచ్చింది. దీంతో ఒక గేటు ఉన్న వైపు నుంచి ప్రయాణీకులను సురక్షితంగా తరలించే అవకాశం కలిగింది. ఈక్రమంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది చూపిన చొరవ అంతా ఇంతా కాదు. కాగా, అగ్నిపథ్ నిరసనకారులు 4-5 రైలు ఇంజన్లు, 2-3 కోచ్‌లకు నిప్పు పెట్టారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేటందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ నిరసనకారుడు మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. నిరసనకారుల రాళ్ల దాడుల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.