TS : మునుగోడులో సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..!!

మునుగోడు ఉపఎన్నిక వేళ…అధికార పార్టీ టీఆర్ఎస్ చండూరులో ఆదివారం రణభేరి సభను నిర్వహించింది. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే కేసీఆర్ సభలో ఎస్సై, కానిస్టేబుల్ ఎంట్రన్స్ రాసిన అభ్యర్థులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరీక్షలో 22 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారంటూ మండిపడ్డారు. వాటికి మార్కులు కలపకుండానే ఫలితాలను విడుదల చేశారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలంటూ సభ ముందు […]

Published By: HashtagU Telugu Desk
CM kcr and telangana

CM KCR Telangana

మునుగోడు ఉపఎన్నిక వేళ…అధికార పార్టీ టీఆర్ఎస్ చండూరులో ఆదివారం రణభేరి సభను నిర్వహించింది. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే కేసీఆర్ సభలో ఎస్సై, కానిస్టేబుల్ ఎంట్రన్స్ రాసిన అభ్యర్థులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరీక్షలో 22 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారంటూ మండిపడ్డారు. వాటికి మార్కులు కలపకుండానే ఫలితాలను విడుదల చేశారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

ఎలాగైనా తమకు న్యాయం చేయాలంటూ సభ ముందు భైఠాయించారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో…వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చండూర్ పీఎస్ కు తరలించారు. ఇక నవంబర్ 3న మునుగోడులో ఉప ఎన్నికల జరగనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.

  Last Updated: 31 Oct 2022, 04:54 AM IST