Site icon HashtagU Telugu

Karimnagar: ఇష్టంలేని పెళ్లి చేసుకున్నారని…యువకుడి కుటుంబంపై కత్తులతో దాడి..!!

Murder

Murder

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. అబ్బాయి, అమ్మాయి ప్రేమ వ్యవహారం..అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసిపోవడంతో…అబ్బాయి కుటుంబ సభ్యులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు చూస్తే…చిగురుమామిడి మండలానికి చెందిన చందు…జగిత్యాలలో ఉంటున్న యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి అన్నకి తెలిసిపోయింది. దీంతో కోపంతో రగిలిపోయిన యువతి అన్న…తన ఫ్రెండ్స్ తో కలిసి చందు కుటుంబంపై కత్తులతో దాడి చేశాడు. ఇంట్లోకి వెళ్లి చందును దారుణంగా కొట్టారు. వీరిని అడ్డుకున్న చందు పేరేంట్స్ పై కూడా కత్తులతో దాడి చేసి గాయపరిచారు. కాగా చందు, యువతి ఈ మధ్యే ప్రేమ వివాహం చేసుకున్నారు.

చందకు కడుపు, శరరీరంపై అనేక చోట్ల గాయాలయ్యాయి. తండ్రి శ్రీనివాస్, తల్లి స్వప్నలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి అరుపులు విన్న చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకోగానే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు బాధితులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చందు కడుపులో కత్తి చిక్కుకుపోయింది. దీంతో వైద్యులు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Exit mobile version