Free Bus Journey : ఈ బస్సుల్లో పురుషులకూ ప్రయాణం ఉచితం

Free Bus Journey :  ‘మహాలక్ష్మి’ పథకం కింద తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ వసతిని కల్పిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 12:39 PM IST

Free Bus Journey :  ‘మహాలక్ష్మి’ పథకం కింద తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ వసతిని కల్పిస్తున్నారు. మహిళా ప్రయాణికుల రద్దీ కారణంగా బస్సుల్లో పురుషులకు సీట్లు దొరకడం లేదు. ఈనేపథ్యంలో త్వరలోనే పురుషుల కోసం ప్రత్యేక బస్సులు వేస్తారని తెలుస్తోంది. ఈనేపథ్యంలో పురుషులకు ఒక గుడ్ న్యూస్. వారికి కూడా ఫ్రీగా ప్రయాణ వసతిని కల్పించే బస్సు సౌకర్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

హైదరాబాద్‌లో ఉండే పురుషులకు ఇది మంచి వార్త. ఎందుకంటే మహిళలతో పాటు పురుషులు కూడా ఏకంగా డబుల్ డెక్కర్ బస్సుల్లో ఫ్రీగా తిరగొచ్చు.  నగరంలోని ట్యాంక్‌బండ్‌, బిర్లా మందిర్‌, అసెంబ్లీ ఏరియా, సాలార్‌ జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, మక్కా మసీదు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్‌, తీగల వంతెన, దుర్గం చెరువు, గండిపేట పార్కు, గోల్కొండ, తారామతి బారాదరి తదితర ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ బస్సులను  నడుపుతున్నారు. వీటిలో ఎవరికైనా జర్నీ ఫ్రీ. గతేడాది హైదరాబాద్‌ వాసులకు డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు.  ఈ బస్సుల్లో తిరుగుతూ నగరంలోని పర్యాటక ప్రదేశాలను చూసి రావచ్చు. రూ.12.96 కోట్లతో గతంలోనే 6 డబుల్‌ డెక్కర్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులను హెచ్‌ఎండీఏ కొనుగోలు చేసింది.  ఈ బస్సులు ఉదయం ట్యాంక్‌ బండ్‌ వద్ద బయలుదేరి ఆయా రూట్లలో తిరుగుతూ తిరిగి ట్యాంక్‌ బండ్‌కు చేరుకుంటాయి. ఛార్జింగ్‌ కోసం ఖైరతాబాద్‌ లోని సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ), సంజీవయ్య పార్కులో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి టిక్కెట్‌ అవసరం లేకుండా ఈ బస్సుల్లో ఎవరైనా తిరగొచ్చు.

Also Read : New Name & Symbol : శరద్ పవార్ పార్టీకి కొత్త పేరు, కొత్త గుర్తు ఇవేనట

ఒకప్పుడు హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిరుగుతుండేవి. ఆ పాత మధుర జ్ఞాపకాలు నేటి తరానికి మళ్లీ పరిచయం చేసేందుకు ఈ డబుల్ డెక్కర్ బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. 2006 సంవత్సరం వరకు హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు కనిపించాయి. సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా జూ పార్కు వరకు, సికింద్రాబాద్‌ – అఫ్జల్‌గంజ్‌ వరకు, సికింద్రాబాద్‌ – మెహిదీపట్నం ఆకుపచ్చ రంగులో ఉండే రెండు అంతస్తుల బస్సులు నడిచేవి. వీటిలో ఒక డ్రైవర్, ఇద్దరు కండక్టర్‌లు విధులు నిర్వహించేవారు. నగరంలో వచ్చిన మార్పులు కారణంగా ఆ బస్సులును ఆపేశారు. ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చారు. ప్రస్తుతానికి వీటిలో ఉచితంగానే తిరిగే ఛాన్స్ కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లో చాలా చోట్ల ఫ్లైఓవర్లు, మెట్రో స్టేషన్లు ఉన్నందున బస్సుల ఎత్తు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎత్తు విషయంలో ఇబ్బంది రాకుండా కొన్ని అనుకూలమైన రూట్లను ఎంపిక చేశారు.