Qasim Razvi : 1948 సెప్టెంబరు 17న నిజాం నవాబు రాక్షస పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించింది. నిజాం నవాబు హయాంలో రజాకార్లు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. రజాకార్ల రాక్షస సైన్యానికి సారథిగా సయ్యద్ ఖాసిం రజ్వీ (Qasim Razvi) వ్యవహరించాడు. అతడికి సంబంధించిన కీలక విషయాలను ఈ కథనంలో మనం తెలుసుకుందాం..
Also Read :Ajit Pawar : నాకూ సీఎం కావాలని ఉంది.. అజిత్ పవార్ కీలక ప్రకటన
- ఖాసిం రజ్వీ ఒక ప్రొఫెషనల్ న్యాయవాది.అతడు మత ఛాందస వాది.
- ఉత్తరప్రదేశ్‌కు చెందిన రజ్వీ.. నిజాం రాష్ట్రంలో భాగంగా ఉన్న లాతూర్‌కు వలస వచ్చి అక్కడ సెటిల్ అయ్యాడు.
- 1927లో నాటి నిజాం రాజు బహదూర్ యార్ జంగ్ తన అనుచరులతో ‘ఎంఐఎం’ పార్టీని ఏర్పాటు చేయించారు.
- 1944లో నిజాం రాజు బహదూర్ యార్ జంగ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. దీంతో ఎంఐఎం నాయకత్వం ఖాసిం రజ్వీ చేతుల్లోకి వెళ్లింది.
- నిజాం రాజు బహదూర్ యార్ జంగ్‌కు విషమిచ్చి హత్య చేశారని అంటారు.
- ఖాసిం రజ్వీ నాయకత్వంలో హైదరాబాద్‌ను రక్షించడానికి మొదలైన రజాకార్ల ఉద్యమం ఆ తర్వాత కాలంలో ఒక రాక్షస మూకగా మారింది.
- 1947 జులై నెల నాటికి హైదరాబాద్ సంస్థానం పరిధిలో దాదాపు 2.50 లక్షల మంది రజాకార్లు ఉండేవారు.
- నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలను అణచివేసేందుకు రజాకార్ల సైన్యాన్ని వాడేవారు.
- నిజాం పాలనకు వ్యతిరేకంగా వార్తలు రాశాడనే కోపంతో జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ చేతులను నరికింది రజాకార్ రాక్షసులే.
- స్వాతంత్య్రం వచ్చిందనే సంతోషంలో 1947 సెప్టెంబరు 2న పరకాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు వచ్చిన ప్రజలపై రజాకార్లు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 15 మంది చనిపోయారు.
- 1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లిలో రజాకార్లు రక్తపుటేరులు పారించి 118 మందిని చంపారు.
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం అయ్యాక.. ఖాసిం రజ్వీ పాకిస్తాన్‌కు పారిపోయేందుకు యత్నించాడు.
- అరబ్బు దేశాలకు ఆయుధాలు విక్రయించే ఆస్ట్రేలియా దళారి అయిన కాటన్ విమానంలో పాక్‌కు చేరాలని ఖాసిం రజ్వీ ప్లాన్ వేసుకున్నాడు. 1948 సెప్టెంబరు 16న తెల్లవారుజామున పారిపోయేందుకు రెడీ అయ్యాడు. హకీంపేటలోని విమాన స్థావరానికి చేరుకున్న రజ్వీను ఎక్కించుకోకుండానే విమానం ఎగిరిపోయింది.
- దారుస్సలాంలోని ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో భారత సైనికులు రజ్వీని అరెస్టు చేశారు. 1948 మద్రాస్ రైలు దోపిడీ కేసులో హైదరాబాద్ సంస్థానం పోలీసు చట్టం కింద అతడిని అరెస్టు చేశారు. కొత్త భారత రాజ్యాంగం ప్రకారం హైదరాబాద్ చట్టం చెల్లదని రజ్వీ వాదించాడు. అయితే ఇతర కేసుల్లో కోర్టు అతడికి 1950లో ఏడేళ్ల జైలుశిక్ష విధించింది.
- 1957 సెప్టెంబరు 11న రజ్వీ కుటుంబంతో సహా పాకిస్తాన్‌కు వెళ్లాడు. 1970లో కరాచీలో చనిపోయాడు.