Fake Teachers : తెలంగాణలోని పలు గవర్నమెంటు స్కూళ్లలో టీచర్ల గోల్‌మాల్ వ్యవహారాలు నడుస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖకు సమాచారం అందింది. కొందరు ప్రభుత్వ టీచర్ల స్థానంలో పలువురు ప్రైవేటు వ్యక్తులు తరుచుగా వచ్చి డ్యూటీ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అందింది. ఈవిధంగా డ్యూటీలకు డుమ్మా కొట్టి.. తమకు బదులుగా ప్రైవేటు వ్యక్తులకు స్కూలుకు పంపుతున్న టీచర్లను గుర్తించే దిశగా కసరత్తు మొదలైంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, తెలంగాణ గురుకులాలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Also Read :Google Willow : సూపర్ కంప్యూటర్లను తలదన్నే స్పీడుతో గూగుల్ ‘విల్లో’.. ఏమిటిది ?
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయుల ఫొటోలను(Fake Teachers) అందరికీ కనిపించేలా స్టాఫ్ రూంలలోని నోటీసు బోర్డుల్లో అతికించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. అసలైన ప్రభుత్వ టీచర్లకు బదులుగా.. కొందరు ప్రైవేటు వ్యక్తులు డ్యూటీలకు వస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ ఆర్డర్స్ ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఈవిధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ టీచర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి వెల్లడించారు.
Also Read :R Krishnaiah : నేను అడగలేదు.. బీజేపీయే పిలిచి రాజ్యసభ ఛాన్స్ ఇచ్చింది : ఆర్ కృష్ణయ్య
ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పలు మారుమూల ప్రాంతాల్లో పలువురు సీనియర్ టీచర్లు స్కూళ్లకు డుమ్మా కొడుతున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. వారు ప్రతినెల రూ.10వేల దాకా ఇచ్చి.. తమకు బదులుగా ప్రైవేటు వ్యక్తులను స్కూలులో డ్యూటీలకు పంపుతున్నట్లు పాఠశాల విద్యాశాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. నెలల తరబడి స్కూలుకు డుమ్మా కొడుతున్న టీచర్లను గుర్తించే దిశగా ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఇలాంటి టీచర్ల వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.