Gruha Jyothi: రాష్ట్రంలో వ్యాప్తంగా గృహజ్యోతి పథకం అమలు.. జీరో బిల్లులు జారీ చేస్తున్న విద్యుత్ సిబ్బంది

  • Written By:
  • Updated On - March 1, 2024 / 04:32 PM IST

Gruha Jyothi: ఎన్నికలకు ముందు కాంగ్రెస్(congress) ఇచ్చిన గ్యారెంటీ(guarantee)ల్లో మరో గ్యారెంటీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గృహజ్యోతి పథకం(gruha jyothi scheme)లో భాగంగా అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం(Free electricity scheme) లబ్ధిదారులకు నేటి నుంచి జీరో విద్యుత్ బిల్లులు(Zero electricity bills)జారీ అవుతున్నాయి. జీరో బిల్లింగ్ కోసం సాఫ్ట్‌వేర్‌‌లో అవసరమైన మార్పులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెక్షన్లలోనూ నేటి నుంచి 200 లోపు యూనిట్లు వినియోగించుకునే లబ్ధిదారులకు జీరో బిల్లులు జారీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

గృహజ్యోతి(Gruha Jyothi) పథకానికి అన్ని అర్హతలు ఉండి కూడా జీరో విద్యుత్ బిల్లు(Zero electricity bills) రాకుంటే దగ్గర్లో ఉన్న మునిసిపల్, మండల కార్యాలయాలకు వెళ్లి మరోమారు దరఖాస్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా తెల్ల రేషన్‌కార్డు, దానికి లింక్ చేసిన ఆధార్‌కార్డ్, విద్యుత్ కనెక్షన్ నంబర్‌ను సమర్పించాలి. కాగా, ఈ పథకానికి ఇప్పటి వరకు 1,09,01,255 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో రేషన్ కార్డులు ఉన్న వారి సంఖ్య 64 లక్షలు మాత్రమే. వీరిలో 34,59,585 మందిని మాత్రమే ప్రభుత్వం అర్హులుగా తేల్చింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఆరు గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను ముఖ్యమంత్రి గత మంగళవారం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు తమకు ఓటు వేసి అధికారం ఇచ్చారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుతున్నామన్నారు. పేదవారి ఇళ్లలో వెలుగులు నింపాలని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

read also : One Nation-One Election: దేశంలో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయా..? కేంద్రానికి నివేదిక అంద‌జేయ‌నున్న క‌మిటీ..!