Site icon HashtagU Telugu

Aarogya Sri Scheme : ఇక రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా ‘ఆరోగ్యశ్రీ’ వైద్యం!

Ration Cards update 2025

Aarogya Sri Scheme : సీఎం రేవంత్ తెలంగాణలోని లక్షలాది మంది ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.10 లక్షల ఉచిత వైద్యం చేయించుకోవాలంటే ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ కార్డు, రేషన్ కార్డు ఉన్నవారే అర్హులు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ రూల్‌ను మార్చాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలని డిసైడ్ చేశారు.అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించి నివేదికను అందజేయాలని పౌరసరఫరాలశాఖ అధికారులను రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది. సీఎం రేవంత్ అధ్యక్షతన మంగళవారం భేటీ అయిన మంత్రివర్గం ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలనే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join

ఆరోగ్యశ్రీ పథకంలో(Aarogya Sri Scheme) భాగంగా పేదలకు ఉచిత వైద్యం అందించే పరిమితిని కాంగ్రెస్ సర్కారు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచింది. పెళ్లిళ్లు చేసుకోవటం, కుటుంబాలు విడిపోవటం, కొత్త రేషన్ కార్డులు జారీ కాకపోవటంతో అర్హులైన చాలా మంది ఈ పథకానికి దూరమవుతున్నారు. ఫ్రీగా అందే లక్షల విలువైన వైద్యం అందకుండా పోతోంది. దీంతో పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి నష్టపోతున్నారు. పేదలకు ఇలాంటి నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స పొందేందుకు రేషన్ కార్డు అవసరం లేదనే రూల్ ను చేర్చనున్నారు.

Also Read :Electoral Bonds : ఈసీకి చేరిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు.. 15న ఏం జరుగుతుందంటే..

  • బసవ తారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి ఇచ్చిన స్థలం లీజును కూడా మరో 30 ఏళ్లకు పొడిగిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • ఇందరమ్మ ఇళ్ల పథకం కింద తొలివిడతగా 4.50 లక్షల ఇళ్లను మంజురూ చేసేందుకు రూ.22,500 కోట్లను కేటాయించాలని మంత్రివర్గం తీర్మానించింది.
  • మహిళా సాధికారితలో భాగంగా వారికోసం ఔటర్‌ రింగురోడ్డు చుట్టూ ఒకట్రెండు ప్రదేశాల్లో విశాలంగా 25-30 ఎకరాల స్థలాలను కేటాయించి వారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్‌ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
  • మరో 2 రోజుల్లో 93 శాతం పైగా రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని తీర్మానించారు.