Jagadeeshwar Goud: మచ్చలేని జీవన ప్రయాణం వాలిదాసు జగదీశ్వర్ గౌడ్ (Jagadeeshwar Goud)ది. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన, ఇంకేదో తపన.. ప్రజల కోసం ఏదైనా సాధించాలన్న జగదీశ్వర్ గౌడ్ పట్టుదల ఆయనను రాజకీయం వైపు మళ్లేలా చేసింది. ఇంతకీ ఈ వాలిదాసు జగదీశ్వర్ గౌడ్ ఎవరో అనుకుంటున్నారా..! ఆయనే కార్పొరేటర్, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్.
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పాత ప్రాంతాలలో ఒకటైన నల్లగండ్ల గ్రామం జగదీశ్వర్ గౌడ్ సొంతూరు. చిన్నప్పటినుండే అన్నిటిలో చురుకుగా జగదీశ్వర్ గౌడ్ చిన్నతనం నుంచే నలుగురికి సాయం చేసే గుణం అలవాటు చేసుకున్నారు. వి. జగదీశ్వర్ గౌడ్ 1975 జూన్ 24న రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నల్లగండ్ల గ్రామంలో వాలిదాసు హరిశంకర్, భాగ్యమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన సిస్టర్ నివేదిత కాలేజీ నుండి ఎంబీఏ, హైదరాబాద్‌లోని పెండికంటి న్యాయ కళాశాల నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి 2003 నుండి 2004లో వరకు బార్ కౌన్సిల్‌కు ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నికయ్యాడు.
ఆ సమయంలోనే ఆయన ప్రజలు పడుతున్న కష్టాలను చూసి ‘శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్’ పేరుతో ఒక సేవా సంస్థను ప్రారంభించి నిరుపేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, ఆరోగ్య ఔత్సాహికులకు సైకిళ్లు, ఉచిత వైద్య శిబిరాలుసహా ఇతర అనేక సామాజికసేవా కార్యక్రమాలను చేపట్టి సమాజంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆరోగ్యం పట్ల ఆయనకున్న ఆసక్తితో వ్యాయామాలపట్ల అవగాహన కార్యక్రమాలు, పరిసరాల పరిశుభ్రతకోసం సెలవు రోజుల్లో విభిన్న వర్గాల ప్రజలతో కలిసి శ్రమదానం వంటి కార్యక్రమాలు, గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచానికి కలుగుతున్న ముప్పును వివరిస్తూ పర్యావరణహితంకోసం ఎన్నో చర్చావేదికలు, సదస్సులను నిర్వహించి ఎంతోమందికి స్పూర్తిదాయకంగా నిలిచారు. జగదీశ్వర్ గౌడ్ కుటుంబం మొదటి నుండి రాజకీయం పట్ల ఆసక్తి కనపరిచారు. జగదీశ్వర్ తండ్రి నల్లగండ్ల గ్రామానికి సర్పంచిగా సేవలందించారు. జగదీశ్వర్ గౌడ్ చిన్నాన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా, ఉమ్మడి పిసిసి అధ్యక్షులుగా పని చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కుటుంబ రాజకీయ ప్రభావం జగదీశ్వర్ గౌడ్ ము ప్రత్యక్ష రాజకీయాల వైపు నడిపించింది. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి తనేంటో నిరూపించుకుని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జగదీశ్వర్ గౌడ్ 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి 2002లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా, ఆ తరువాత 2008లో జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి యువజన వ్యవహారాలు & క్రీడలు మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థ నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌కు కార్యనిర్వాహక సభ్యుడిగా నియమితుడయ్యాడు.
Also Read: Manda Krishna Madiga : మోడీని పట్టుకొని కన్నీరు పెట్టుకున్న మందకృష్ణ
జగదీశ్వర్ గౌడ్ 2009లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్‌గా తొలిసారి గెలిచాడు. ఆయన ఆ తరువాత 2016, 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెండుసార్లు బీఆర్‌ఎస్ పార్టీ నుండి 107 డివిజన్ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచాడు.
జగదీశ్వర్ గౌడ్ 2018లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశించగా, పార్టీ నచ్చజెప్పడంతో ఆయన పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గెలుపులో కీలకంగా పని చేశాడు. ఆయనను 2023 సెప్టెంబర్ 27న జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా నియమితుడయ్యాడు. జగదీశ్వర్ గౌడ్ 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో శేరిలింగంపల్లి టికెట్ కోసం పోటీ పాడగా పార్టీ తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి టికెట్ కేటాయించడంతో మనస్థాపం చెందిన ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అక్టోబర్ 18న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 27న కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో ఆయనను శేరిలింగంపల్లి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన నవంబర్ 03న నామినేషన్ దాఖలు చేశాడు.
ప్రస్తుత రాజకీయాలంటేనే అవినీతి, స్వార్థం, దౌర్జన్యాలకు చిరునామా. విద్యావంతునిగా, సామాజికవేత్తగా ఇప్పటికే మంచి గుర్తింపును సాధించిన జగదీశ్వర్ గౌడ్ తన రాజకీయ హోదాలో పదవుల పరంపరలో ఏ చిన్న పొరపాటుకు, అవినీతికి ఆస్కారం ఇవ్వకపోవటం ఆయన రాజకీయ దార్శనికతకు నిదర్శనం. జగదీశ్వర్ గౌడ్ రాజకీయ నైపుణ్యాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆయనను పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా శేరిలింగంపల్లి టికెట్ ను ఇచ్చింది ఆయన ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవాలి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల బరిలో వివిధ పార్టీల నుండి శేరిలింగంపల్లిలో పోటీలో చేసేవారిలో జగదీశ్వర్ గౌడ్ స్థానికుడు కావడం కలిసి వచ్చే అంశం. నవంబర్ 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ నుండి జగదీశ్వర్ గౌడ్ విజయం సాధించడం ఖాయమని జగదీశ్వర్ గౌడ్ వర్గీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.