Heavy Rains In Telangana: తెలంగాణలో మూడు రోజులు అతి భార్షీ వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: IMD

రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

  • Written By:
  • Publish Date - September 10, 2022 / 06:53 PM IST

రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయంటూ వెల్లడించింది. వర్షాలతోపాటుగా గంటకు 30కిలో మీటర్ల నుంచి 4కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వర్షపాతానికి సంబంధించిన మ్యాపులను ట్వీట్ చేసింది.

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం …దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని నారాయణపేట్, పాలమూరు, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపంది. వికారాబాద్ , రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రమంతా భారీ వర్షాలు పడతాయని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.