IMD : మరోవారం రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు హెచ్చరిక!!

ఆంధ్రప్రదేశ్ లో సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం దగ్గర అలలు ఎగిసిపడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - August 10, 2022 / 08:59 PM IST

ఆంధ్రప్రదేశ్ లో సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం దగ్గర అలలు ఎగిసిపడుతున్నాయి. తీరంలో 5మీటర్ల ఎత్తున కెరటాలు ఎగిసిపడుతున్నాయి. 150మీటర్ల ముందుకు సముద్రం చొచ్చుకొచ్చింది. అలల తాకిడికి రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఇదిలా ఉండగా తెలంగాణ కూడా భారీ వర్షాలు బీభత్స వాతావారణాన్ని కలిపిస్తున్నాయి. ఇప్పటికే భారీగా కురుస్తున్న వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంతోపాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటమునిగాయి. రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కాగా ఐఎండీ తెలంగాణకు మరో వారం రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సూచించింది. అంతేకాదు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. నేటి నుంచి ఈనెల 16వరకు రాష్ట్రంలో కొన్ని చోట్లు తేలికపాటి…నుంచి…మోస్తరు వర్షాలు కురవున్నట్లు ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, జిల్లాలతోపాటు మంచిర్యాలు, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్క బారీ వర్షాలు కురస్తాయని ఐఎండీ తెలిపింది. దీంతోపాటుగా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది.