Rain Alert Today : రాబోయే వారం రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇవాళ్టి నుంచి శనివారం వరకు తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ లోనూ సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో ఆదివారం వరకూ వానలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వివరించారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Rain Alert Today) జారీ చేశామని తెలిపారు. వచ్చే రెండు రోజులలో ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తాలలోనూ వానలు కురిసే అవకాశం ఉందన్నారు.
Rain Alert Today : నేటి నుంచి వారం రోజులు వర్షసూచన
