Site icon HashtagU Telugu

IMD issues: హైదరాబాద్ కు ‘ఎల్లో’ అలర్ట్!

Hyderabad

Hyderabad

హైదరాబాద్ లో శని, ఆదివారాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో నగరంలో వారాంతపు వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ నాలుగు రోజులపాటు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలో సగటు రాత్రి ఉష్ణోగ్రత 19.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కుతుబుల్లాపూర్, దాని పరిసర ప్రాంతాలలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 14.2 డిగ్రీల సెల్సియస్, ఆ తర్వాత పటాన్‌చెరులో రాత్రి ఉష్ణోగ్రత 16.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) అంచనా ప్రకారం గాజులరామారం, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, చార్మినార్ సహా పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌ కంటే తగ్గే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వారాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాలు, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌ కంటే తగ్గే అవకాశం ఉందని అంచనా.

హైదరాబాద్

కుతుబుల్లాపూర్: 14.2 డిగ్రీల సెల్సియస్

పటాన్చెరు: 16.6 డిగ్రీల సెల్సియస్

గాజులరామారం: 18 డిగ్రీల సెల్సియస్

కూకట్‌పల్లి: 18.3 డిగ్రీల సెల్సియస్‌

రాజేంద్రనగర్: 18.6 డిగ్రీల సెల్సియస్

ఇతర జిలాల్లో..

వికారాబాద్: 11.3 డిగ్రీల సెల్సియస్

సంగారెడ్డి: 12.0 డిగ్రీల సెల్సియస్

ఆదిలాబాద్: 12.3 డిగ్రీల సెల్సియస్

కామారెడ్డి: 12.3 డిగ్రీల సెల్సియస్

నిజామాబాద్: 12.3 డిగ్రీల సెల్సియస్

Exit mobile version