Rain Alert Today : ఈరోజు తెలంగాణలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. “ఇవాళ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది” అని చెప్పారు. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా ఉంటుందని అంచనా వేశారు. గాలులు నైరుతి దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.
Also read : X mark : వందే భారత్ ట్రైన్స్ చివరి బోగీలపై X గుర్తు ఎందుకు లేదు ?
ఆంధ్రప్రదేశ్ లో..
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా, యానాంలలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rain Alert Today) లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురవొచ్చు. ప్రకాశం, తూర్పు పల్నాడు జిల్లా కోస్తా భాగాల్లో వర్షాలు కొనసాగుతాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి.