Hyderabad: రానున్న రెండు రోజుల్లో హైదరాబాద్( hyderabad)తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండాకాలాన్ని తలపించేలా వాతావరణం ఒక్కసారిగా వేడిక్కింది. అయితే నిన్న శుక్రవారం వాతావరణ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
శుక్రవారం తెలంగాణ (telangana) లో పలు చోట్ల వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో అత్యధికంగా బన్సీలాల్‌పేట 68.5 మి.మీ, గన్‌ఫౌండ్రీలో 68.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉప్పల్‌లో 67.0, బేగంబజార్‌లో 62.8, నాచారంలో 61.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఐఎండీ ప్రకారం హైదరాబాద్, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 23న తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26న వర్షాలు కురిసే అవకాశం లేదు. అయితే సెప్టెంబరు 27న మళ్లీ ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
Also Read: Atishi Swearing LIVE: అతిషి అనే నేను