Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు

తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

Rains Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి తాపానికి పశువులు మరణిస్తున్నాయి. ఇక వయసు పైబడిన వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ ముగుస్తుంది. మే నెలలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలు మరింత అపప్రమత్తంగా ఉండాల్సి ఉంది.. ఈ నేపథ్యంలో ఐఎండీ తీపి కబురు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.

తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. నిర్మల్, కుమురం భీమ్, మంచిర్యాలు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లె, జె.భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, వై.భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో వర్షాలు కురనున్నాయి.

We’re now on WhatsAppClick to Join

ఉరుములతో కూడిన వర్షం కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల సెల్సియస్ స్థాయికి పడిపోవచ్చు. అయితే ఈ ఉష్ణోగ్రత తగ్గుదల రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కొన్ని జిల్లాల్లో మాత్రమే అంచనా వేయబడింది.నిన్న జగిత్యాల, ములుగు, నల్గొండ, కరీంనగర్‌లలో 45 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద అత్యధికంగా 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలోని బహదూర్‌పురా, షేక్‌పేట్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, ముషీరాబాద్, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, బండ్లగూడ, సైదాబాద్ మరియు మారేడ్‌పల్లిలో 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఐఎండీ హైదరాబాద్‌లోని వివిధ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేయడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.దీంతో ప్రజలకు ఉపశమనం లభించనుంది.

Also Read: Akhil Akkineni : అయ్యగారు వచ్చి ఏడాది.. ఇంకా ఓటీటీలోకి రాని ఏజెంట్‌