Site icon HashtagU Telugu

Hyderabad Racing: స్వాతంత్ర దినోత్సవం రోజున నగర శివార్లలో రేసింగ్

Hyderabad Racing

New Web Story Copy (8)

Hyderabad Racing: హైదరాబాద్ శివారు ప్రాంతంలో కొందరు యథేచ్ఛగా బైక్, కార్ రేసింగ్ లకు పాల్పడుతున్నారు. దీంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసులు హెచ్చరించినప్పటికీ కొందరు యువకులు భేఖాతర్ చేస్తున్నారు. తాజాగా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున సెలవు దినం కావడంతో వందలాది మంది అక్రమ రేసింగ్ లకు పాల్పడ్డారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో కొందరు యువకులు అక్రమంగా కార్లు, బైక్ రేసింగ్‌లు నిర్వహించారు.

స్వాతంత్ర దినోత్సవం కావడంతో పోలీసులు ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. ఇదే అదునుగా సదరు యువకులు అక్రమ రేసింగ్ లకు పాల్పడ్డారు. అందులో భాగంగా ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల మధ్య అటవీ ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. ఈ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోమవారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి, ఆ తర్వాత నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సోదాలు ప్రారంభించారు. విశేషమేంటంటే ఎయిర్ గన్‌లు, ప్రభుత్వ సైరన్‌లను పెట్టుకుని ఈ రేసింగ్ లకు పాల్పడ్డారు. కొన్ని కేటగిరీల వాహనాలకు మాత్రమే సైరన్‌లను ఉపయోగించేందుకు అనుమతి ఉన్నప్పటికీ, సదరు యువకులు సైరన్ లు ధరించి వన్యప్రాణులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు.

Also Read: Bro..Bhola : మెగా బ్రదర్స్ ను నమ్మకుంటే రూ. 80 కోట్లు లాస్..?