Site icon HashtagU Telugu

Minister Seethakka : మంత్రి సీతక్క పేరు చెప్పి అక్రమ వసూళ్లు

Minister Seethakka

Minister Seethakka

ములుగు ఎమ్మెల్యే , మంత్రి సీతక్క (Minister Seethakka) పేరు చెప్పి మాజీ ఎమ్మెల్యే అక్రమ వసూళ్లు , దందాలకు పాల్పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే బహిరంగ లేఖ రాయడం రాష్ట్రంలో కీలకంగా మారింది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల హోరు నడుస్తుంది. ఈరోజు నుండి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే భారీ విజయం సాధించామో..ఈ ఎన్నికల్లో కూడా అలాగే విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తుంది. కానీ ఆ ఛాన్స్ కాంగ్రెస్ కు ఏమాత్రం ఇవ్వదంటూ బిఆర్ఎస్ , బిజెపి పార్టీలు వ్యూహాలు రచిస్తూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ఓ పక్క విమర్శలు చేస్తూనే ..కాంగ్రెస్ నేతల ఫై ఓ కన్నేశారు. వారు చేస్తున్న పనులపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు.

ఈ తరుణంలో సిర్పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప (Former MLA Koneru Konappa)..మంత్రి సీతక్క పేరు చెప్పి అక్రమ వసూళ్లు, దందాలకు పాల్పడుతున్నారని సిర్పూర్ స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు (Palvai Harish Babu) తెలుపుతూ మంత్రి సీతక్క కు బహిరంగ లేఖ రాసారు. అక్రమాలకు కేరాఫ్‌గా ఉన్న కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన దో నెంబర్ దందాలను కొనసాగించడం, నిత్యాన్నదాన సత్రానికి ఫండ్ వసూలు చేయడం ప్రారంభించాడని లేఖలో పేర్కొన్నారు. దీనికి అతని మేనల్లుడు, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ అన్ని విధాలా సహకరిస్తూ మీ పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నాడని లేఖలో వివరించారు. మామ, అల్లుళ్ళ ఆగడాలు అరికట్టాలని కోరుతూ.. లేఖలో రాసుకొచ్చారు. మరి దీనిపై మంత్రి సీతక్క ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read Also : Mancherial : కాషాయ దుస్తులతో పాఠశాలకు విద్యార్థులు.. ప్రశ్నించినందుకు ప్రిన్సిపాల్‌పై కేసు

Exit mobile version