హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జరిగిన హృదయవిదారకమైన ఘటన సర్వత్రా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళపై కుటుంబ సభ్యులు అత్యంత హీనంగా వ్యవహరించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పదేళ్లుగా జీవిస్తున్న వివాహిత భర్త, తన బంధువైన మరో మహిళతో సంబంధం పెట్టుకొని, ఆమెతో కలిసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపిన ఆమెపై ఆగ్రహంతో కుటుంబ సభ్యులు ఘోరమైన చర్యలకు దిగారు.
Telangana : తెలంగాణలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఐదు రోజుల క్రితం బాధితులిద్దరినీ వెతికి పట్టుకొని తాటికాయల గ్రామానికి తీసుకెళ్లిన మహిళ బంధువులు, వారిపై దాడి చేశారు. ఆ మహిళను చెట్టుకు కట్టేసి, విచక్షణలేకుండా కొట్టారు. అంతటితో ఆగకుండా ఆమెను బలవంతంగా వివస్త్రను చేసి, ఆమె ప్రైవేట్ భాగాల్లో జీడిపోసి చిత్రహింసలు పెట్టారు. ఆమె భర్తతో పాటు ఆమె జుట్టును గుండు గీయించి అవమానించారు. గ్రామ పెద్దలెవరూ దీనిపై స్పందించకపోవడం, ఇతరులు కాస్త దూరంగా ఉన్నారు. ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ విషయంపై పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల ఆచూకీ తెలియకపోవడంతో మిస్సింగ్ కేసుగా కూడా విచారణ కొనసాగుతోంది. సామాజికంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతుండటమే కాదు, బాధితులపై మరింత అఘోరమైన హింసా చర్యలు కొనసాగుతుండడం ఆందోళనకరం. న్యాయం కోసం బాధితురాలికి సమర్థమైన సహాయం అందించాల్సిన అవసరం ఎంతో ఉంది.