వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటన (Incident of attack on the collector) కు సంబంధించి ఐజీ సత్యనారాయణ (IG Satyanarayana) కీలక విషయాలు వెల్లడించారు. లగచర్లలో ఫార్మా సిటీకి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, జిల్లా అధికారులపై కొంతమంది రైతులు దాడి చేయడం కలకలం రేపింది. దాడి కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 52 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు. వీరిలో 16 మందిని రిమాండ్ కు తరలించామని , ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక దాడి చేసిన వారిలో 19 మందికి భూమి లేదని, మరియు కొందరికి భూమి ఉన్నప్పటికీ భూసేకరణ నోటిఫికేషన్ పరిధిలోకి రాకుండా ఉన్నారని వివరించారు. ఈ కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, త్వరలోనే ఛార్జ్ షీట్ ఫైల్ చేయనున్నట్లు ఐజీ సత్యనారాయణ చెప్పారు.
భూసేకరణ విషయంలో కొన్ని అపార్థాలు, అన్యాయాలు జరిగాయనే భావనతో కొంతమంది ఈ దాడికి పాల్పడ్డారని తెలిసింది. అలాగే, ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు, భూసేకరణ ప్రక్రియను సమర్థవంతంగా కొనసాగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కట్టుబడి ఉందని వివరించారు. పోలీసు దర్యాప్తు పూర్తయిన వెంటనే సంబంధిత ఆధారాలు సేకరించి, న్యాయవిధానం ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాడి ఘటనలో ఇంకా ఎవరైనా ప్రమేయం కలిగి ఉంటే, వారిని గుర్తించి తగిన దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.
Read Also : Ramana gogula – Venkatesh : 18 ఏళ్ల తర్వాత వెంకీ తో చేతులు కలిపిన రమణ గోగుల