Site icon HashtagU Telugu

Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Ktrtirupthi

Ktrtirupthi

లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు (Formula E Car Race Case) తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతోంది. హైదరాబాద్‌లో ‘కార్ లాంజ్’ పేరిట సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్ నిర్వహిస్తున్న డీలర్ బషరత్ ఖాన్‌ను ఇప్పటికే DRI అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతను అమెరికా, జపాన్ నుంచి రోల్స్ రాయిస్, హమ్మర్ EV, ల్యాండ్ క్రూజర్ వంటి అధిక విలువైన కార్లను దుబాయ్, శ్రీలంక మార్గం ద్వారా తెచ్చి సెకండ్ హ్యాండ్ కార్లుగా చూపి ప్రభుత్వానికి 25 నుంచి 100 కోట్ల వరకు పన్ను ఎగవేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈడీ తాజా సోదాల్లో 30కి పైగా లగ్జరీ కార్ల ఇంపోర్ట్ వివరాలు బయటపడ్డాయి.

Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేరు వినిపించడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. బషరత్ ఖాన్ నుంచి TG09D6666 నంబర్‌తో ఉన్న ల్యాండ్ క్రూయిజర్‌ను కేటీఆర్ కుటుంబసభ్యుల కంపెనీ ద్వారా కొనుగోలు చేశారని ఈడీ గుర్తించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ బయటపెట్టారు. అదేవిధంగా ఆ కార్లు బ్లాక్ మనీతో కొనుగోలు అయ్యాయా అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ తాను తప్పు చేయలేదని, అరెస్టు చేయాలనుకుంటే చేసుకోవచ్చని ధైర్యంగా సమాధానం ఇచ్చారు. అయితే బషరత్ ఖాన్ దగ్గర కారును కొనుగోలు చేశారా లేదా అన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు.

ఇక ఈడీ దర్యాప్తులో “ఎట్ హోం హాస్పిటాలిటీ సర్వీసెస్” అనే కంపెనీ పేరుతో ఆ కార్ రిజిస్టర్ అయి ఉందని, ఇందులో కేటీఆర్‌తో పాటు ఆయన భార్య కల్వకుంట్ల శైలిమ డైరెక్టర్లుగా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగా ఈ లావాదేవీపై కూడా ఈడీ దృష్టి సారించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇటువంటి సున్నితమైన సమయంలో కేటీఆర్ “అరెస్టు చేసుకుంటే చేసుకోవచ్చు” అని సవాల్ విసరడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. కేసు దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుందో, దీనిపై రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version