Gangula Kamalakar: కాంగ్రెస్ కు ఓటేస్తే ఆంద్రోళ్లను తరిమికొడతాం- మంత్రి గంగుల సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికల తరుణంలో సెటిలర్ల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అనేక కసరత్తు చేస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Minister Gangula Kamalakar Meeting with Millers association

Minister Gangula Kamalakar Meeting with Millers association

Gangula Kamalakar: చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఐటీ ఉద్యోగులు, ఆంధ్రా సెటిలర్ల నిరసనలు హైదరాబాద్‌లో రాజకీయంగా చర్చనీయాంశమవుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి సెటిలర్లు చాలా మంది ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో సెటిలర్ల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అనేక కసరత్తు చేస్తున్నాయి.

నాయుడు అరెస్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఒకరిద్దరు మాత్రమే అరెస్ట్ వార్తలను ఖండించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బెదిరింపు వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అంద్రోళ్లు కాంగ్రెస్ ని అడ్డం పెట్టుకొని మళ్ళీ రావాలని చూస్తున్నారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తె అంద్రోళ్లును తరిమి తరిమి కొడతాం ఆయన కామెంట్స్ చేయడం రాజకీయ దుమారం రేపుతుంది.

“మరోసారి ఆంధ్రులు కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఆంధ్రా సెటిలర్లలో ఎవరైనా కాంగ్రెస్‌కు మద్దతిచ్చినా లేదా ఓటు వేసినా బయటకు పంపిస్తాం. కమలాకర్ వ్యాఖ్యలు ప్రత్యక్షంగానూ, బహిరంగంగానూ బెదిరింపులకు దారితీసేలా ఉన్నాయి. ఇది ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధం. ఇది సాధారణ ఎన్నికల ముందు ద్వేషపూరిత ప్రసంగం కిందకు వస్తుంది. ఈసీ షెడ్యూల్‌ ప్రకటించడంతో ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. గంగుల కమలాకర్ వ్యాఖ్యలను ఈసీ సుమోటోగా తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. అలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు హింసకు, ఏవైనా అవాంఛనీయ సంఘటనలకు దారితీయవచ్చు.

Also Read: Harish Rao: కర్ణాటక అక్రమ సొమ్మును కాంగ్రెస్ తెలంగాణ తరలిస్తోంది: మంత్రి హరీశ్ రావు

  Last Updated: 13 Oct 2023, 03:18 PM IST