తన కూతురు కవిత అరెస్ట్ (MLC Kavitha Arrest) మాజీ సీఎం కేసీఆర్ (KCR) మరోసారి స్పందించారు. ‘సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా..? అని ప్రశ్నించారు. మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా తన కుమార్తె కవిత అరెస్ట్ పై స్పందించారు. రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టారని.. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా తనకు బాధ ఉండదా? అని ప్రశ్నించారు. కానీ, తాను మాత్రం అగ్నిపర్వతంలా ఉన్నానని ,పార్టీలో క్లిష్టమైన పరిస్థితులు ప్రస్తుతానికి ఏమీ లేవని అన్నారు. ఇప్పుడు ఉన్న ఇబ్బందికర పరిస్థితుల కంటే గడ్డు పరిస్థితుల్లోనే తెలంగాణ సాధించానని గుర్తు చేసుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా? అని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై పట్టు సాధించలేకపోయిందని.. రాష్ట్రంలో సరైన పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలో ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎందుకు అదుపుతప్పాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు. ఎక్కడో ఉన్న వారిని తెరపైకి తెచ్చి, వారిని ఎమ్మెల్యేలను చేసి, మంత్రులను చేసి లేదా ఇతర పదవులు ఇచ్చానని గుర్తు చేసారు. అలాంటి నేతలు పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారని కాస్త ఆవేదన చెందారు.
లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసు లో తీహార్ జైలులో క్వైత గత నాల్గు నెలలుగా ఖైదీగా శిక్ష అనుభవిస్తుంది. ఈ కేసులో కవిత ను మార్చి 15న అదుపులోకి తీసుకున్నారు. మార్చి 26 న జ్యూడీయల్ ఖైదీగా కవిత తీహార్ జైలు కు తరలించారు. అప్పటి నుండి బెయిల్ కోసం కవిత.. పలుమార్లు పిటిషన్లు దాఖలు చేయగా.. ప్రతిసారీ నిరాశే ఎదురవుతూ వస్తోంది. ఈ కేసులో డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణను ఆగస్టు 5 వ తేదీకి వాయిదా వేసింది.
Read Also : Revanth On Budget: సబ్ కా సాత్ పెద్ద బోగస్, బడ్జెట్‌పై సీఎం ఫైర్
