Site icon HashtagU Telugu

Telangana: దక్షిణ తెలంగాణ సస్యశ్యామ‌లంగా ఉండాలంటే..!

Telangana

Telangana

Telangana: దక్షిణ తెలంగాణ (Telangana) ప్రజల సాగు త్రాగు నీటి సమస్యల పరిష్కారం కోసం నిర్మించ తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను గత ముప్పై ఏళ్లుగా రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య సభ్యులు డిమాండ్ చేసారు. సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో సమాఖ్య సభ్యులు మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాల రైతుల మధ్య అసమానతలు,వివక్ష,అన్యాయంపై శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కృష్ణనది పరిరక్షణ జాయింట్ ఆక్షన్ కమిటీ, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆద్వర్యంలో విలేఖరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విజయ పాల్ రెడ్డి ఆద్వర్యంలో జరిగింది.

పాదూరి శ్రీనివాస రెడ్డి. సమాఖ్య న్యాయ సలహాదారు.. కృష్ణజలాలను దక్షిణ తెలంగాణాకు తరలించి త్రాగు సాగునీటి సమస్యలను పరిష్కరించాలని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను వేగవంతంగా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య న్యాయ సలహాదారు శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేసారు. పాలమూరు ప్రాజెక్టు అంశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, పొన్నాల లక్ష్మయ్య వంటి నాయకులు పాలమూరు ప్రాజెక్టు కు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. పదేళ్లుగా బీఆరెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టింది తప్ప ప్రాజెక్టులను పూర్తిచేయలేదని మండి పడ్డారు. పాలమూరు బిడ్డగా ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. దక్షిణ తెలంగాణను హరీష్ రావు, పొన్నాల లక్ష్మయ్య, కేసీఆర్, ఈటెల రాజేందర్ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. రైతులను ఉగ్రవాదులతో పోల్చిన ప్రధాని మోది ఆ పదవికి అనర్హుడని మండిపడ్డారు. దేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే కుట్రలకు తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెర తీసారని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించడం దారుణమన్నారు. ఇప్పటికయినా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు ను పూర్తి చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని శ్రీనివాస రెడ్డి కోరారు.

ప్రొఫెసర్ ఆర్ రమేష్ రెడ్డి.. (ఫార్మర్ డీన్, ప్రిన్సిపల్ యునివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ) సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రతినిధులు అనకుండా ప్రజా సేవకులు అభివర్ణించడం ఆహ్వానించదగ్గ పరిణామం. స్థానిక సమస్యలతో పాటు పాలమూరు జిల్లా సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సారథ్యంలో పాలమూరు ప్రాజెక్టు కోసం ఎన్నో విజ్ఞప్తులు అందించామన్నారు. ఉత్పాదక త లేని సంపద నిరర్థకం అనే వాస్తవాన్ని వెనుజ్వేలా వంటి ఎన్నో దేశాలు నిరూపించాయన్నారు. తెలంగాణలో దక్షిణ తెలంగాణ ఉద్యమం తలెత్తే ప్రమాదం పొంచి ఉందన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేసారు.

సింగిడి రామస్వామి.. (వైస్ ప్రసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్, తెలంగాణ) సుధీర్ఘ కాలం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిలక్ష్యానికి గురి కావడం దారుణమైన అంశం. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తేనే దక్షిణ తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. రైతు రుణ మాఫీ, రైతు భరోసా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏం శ్రీనివాసరెడ్డి, రమేష్ రెడ్డి, శ్రీరాం రెడ్డి మరియు సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.