Site icon HashtagU Telugu

CM Revanth Reddy: మెట్రో నుంచి ఎల్‌అండ్‌టీ తప్పుకున్నా పర్లేదు: సీఎం రేవంత్

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy: మెట్రో నుంచి ఎల్‌అండ్‌టీ తప్పుకున్నా పర్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్‌ పథకం ప్రభావం హైదరాబాద్ మెట్రోపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుండటంతో, మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. దీంతో మెట్రోని నడపడం ఎల్‌అండ్‌టీకి తలకు మించిన భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మెట్రో నుంచి ఎల్‌అండ్‌టీ తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నుంచి ఎల్‌ అండ్‌ టీ (లార్సన్‌ అండ్‌ టర్బో) వైదొలగాలని భావిస్తుంటే స్వాగతిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

ఈ రోజు మే 15న బుధవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామన్న కాంగ్రెస్‌ హామీ మెట్రో రైల్‌ నష్టంతో ఆగదని స్పష్టం చేశారు.ఎల్‌అండ్‌టి నష్టాలు లేదా లాభాల గురించి మేము బాధపడటం లేదని, ఎల్‌ అండ్‌ టీ వైదొలగాలని భావిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందన్నారు సీఎం. ఒక కాంట్రాక్టర్ పోతే మరో కాంట్రాక్టర్ వస్తాడు. ఇది పెద్ద విషయం కాదు అని రేవంత్ విలేకరుల సమావేశంలో అన్నారు.

2026 తర్వాత మెట్రో ప్రాజెక్ట్ నుండి ఎల్‌అండ్‌టీ నిష్క్రమించే అవకాశం ఉందని ఎల్‌అండ్‌టీ డైరెక్టర్ శంకర్ రామన్ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు పెరిగినా బస్సుల సంఖ్య పెరగకపోవడంతో మహాలక్ష్మి పథకం నిలకడగా లేదన్నారు. అయితే రామన్ ప్రకటనపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ప్రభుత్వాలు కార్పొరేట్ల ఇష్టాయిష్టాలు, కల్పనలకు అనుగుణంగా పనిచేయవని అన్నారు. ప్రజల సంక్షేమం, ముఖ్యంగా మహిళల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యత. ఏది వచ్చినా ఈ పథకాన్ని కొనసాగిస్తాం. మేము ప్రతి నెలా సత్వరమే ఆర్టీసీకి నిధులను రీయింబర్స్ చేస్తున్నాము. ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీ ఆర్థిక సంక్షోభంలో పడకుండా చూస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read: UN Apology : భారత్‌కు ఐక్యరాజ్యసమితి క్షమాపణలు.. ఎవరీ వైభవ్ అనిల్ కాలే ?